Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపునే రోజుకి 10 వేపాకులు తింటే....?

వేప చెట్టు నీడ ఎంత చల్లగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నీడతో పాటు వేపచెట్టు గాలి, పూత, కాయలు, ఆకులు, బెరడు... ఇలా వేపచెట్టుకు సంబంధించిన ప్రతిదీ ఆరోగ్యకరమే. కాబట్టి చేదుగా ఉంటుంది కదా అని తేలికగా చూడకుండా వేపకాయలు, విత్తనాల నుంచి తీసిన నూనెన

Webdunia
సోమవారం, 4 జులై 2016 (16:39 IST)
వేప చెట్టు నీడ ఎంత చల్లగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నీడతో పాటు వేపచెట్టు గాలి, పూత, కాయలు, ఆకులు, బెరడు... ఇలా వేపచెట్టుకు సంబంధించిన ప్రతిదీ ఆరోగ్యకరమే. కాబట్టి చేదుగా ఉంటుంది కదా అని తేలికగా చూడకుండా వేపకాయలు, విత్తనాల నుంచి తీసిన నూనెను ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగించాలి. 
 
పరగడుపునే రోజుకి 10 వేపాకులు తింటే మధుమేహం అదుపులోకి వస్తుంది. వేపనూనెతో మర్ధన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. నాలుగు కప్పుల నీళ్లలో ఒక కప్పు వేప బెరడును మరిగించి ఆ నీళ్లను కాలిన మచ్చలపై పూస్తే కొద్ది రోజులకు మచ్చలు మాటుమాయమవుతాయి. వేప పూలను నూరి ఆ ముద్దతో తలకు పట్టు వేస్తే తలనొప్పి తగ్గుతుంది. 
 
కొన్ని చుక్కల వేప ఆకుల రసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. ఒక టీ స్పూన్ వేప బెరడుకు రెండు టీస్పూన్ల బెల్లం కలిపి తీసుకుంటే మొలలు తగ్గుతాయి. ఒక టీస్పూను వేపాకు పొడిని తింటే అసిడిటీ తగ్గుతుంది. వేపనూనె చుండ్రును నివారిస్తుంది. కాబట్టి తలస్నానానికి ముందు ఈ నూనెను తలకు పట్టించి మర్దనా చేయాలి. మొటిమలు తగ్గాలంటే వాటి మీద వేప నూనె పూయాలి. 
 
వేపనూనె యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి వెంట్రుకల సమస్యలున్న వాళ్లు వేపనూనెలో కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించి, తలస్నానం చేయాలి. మేలురకమైన పలుచని వేపనూనెను సేకరించుకొని ,స్నానానికి గంట ముందుగా రెండు పూటల స్థనాలపైన లేపనం చేస్తూ వుంటే క్రమంగా స్థనాల వాపు, పోటు, మంటలు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments