Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా? బార్లీ నీళ్లు తాగండి.

బరువు తగ్గాలనుకునేవారు కూడా ప్రతిరోజూ బార్లీ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే..? బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేయడమే కాదు.. జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తాయి

Webdunia
శనివారం, 22 జులై 2017 (15:32 IST)
బరువు తగ్గాలనుకునేవారు కూడా ప్రతిరోజూ బార్లీ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే..? బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేయడమే కాదు.. జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తాయి. తద్వారా బరువు అదుపులోకి వస్తుంది. డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడేవారికి బార్లీ నీరు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గించడంలోనూ బార్లీ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హృద్రోగ సమస్యలూ దరి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. అజీర్తికి బార్లీ నీళ్లు చెక్ పెడతాయి. మధుమేహం ఉన్నవారూ బార్లీ నీళ్లకు ప్రాధాన్యమిస్తే మేలు.
 
ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులుండవు. ఇన్సులిన్‌ కూడా అదుపు తప్పదు. దీనిలో ఉండే గ్లైసమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్య కూడా దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments