Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుడుకాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత? (video)

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:54 IST)
చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి. చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషదంలా పని చేస్తాయి.
 
చిక్కుడు కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైనది. అంతేకాకుండా విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 
చిక్కుళ్లలో వున్న కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్.... వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలోని కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతుంది. ఫలితంగా చిక్కుడు కాయలు వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయని తేలింది.
 
సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. అందుకే దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి చిక్కుడు మంచి ఔషదంలా పని చేస్తుంది.
 
నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక  ఆందోళనను తగ్గిస్తాయి. అలాగే వీటిల్లోని పొటాషియం కండరాల వృద్దికి, పని తీరుకి తోడ్పడుతుంది. అంటే మనకు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నమాట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

తర్వాతి కథనం
Show comments