Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

అలాంటి వారు అప్పడాలు తింటే ఆరోగ్యం అప్పడమే... ఎందుకని? (video)

Advertiesment
Papads
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:22 IST)
అప్పడాలు.. కరకరమంటూ సైడ్ డిష్ గా తింటుంటే ఆ రుచి వేరు. నిజానికి ఒకప్పుడు ప్రతి భారతీయ ఇంటి వాకిట్లోనో లేదంటే భవనంపైనో ఈ అప్పడాలను చేసి ఎండబెట్టుకుంటూ వుండేవారు. ఐతే ఎప్పుడైతే సూపర్ మార్కెట్లు వచ్చాయో సహజసిద్ధమైన అప్పడాలు కూడా మాయమయ్యాయి. నూనెలో వేయగానే పొంగుతూ వచ్చే ఆ అప్పడాలు తింటే ఆరోగ్యం అప్పడమైపోతుందంటున్నారు వైద్యులు.
 
రెండు అప్పడాలు తింటే ఒక చపాతీ ద్వారా వచ్చే కేలరీలు శరీరంలోకి చేరిపోతాయని చెపుతారు. ముఖ్యంగా ఫ్యాక్టరీల్లో తయారుచేసిన అప్పడాల్లో రుచికోసం సోడియం ఉప్పును అధికంగా ఉపయోగిస్తారు. ఈ ఉప్పు కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 
గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు మరియు అధిక బిపి ఉన్నవారికి అప్పడాల వల్ల అధిక సోడియం శరీరంలోకి చేరుతుంది. స్టోర్లో కొన్న పాపడ్‌లు తరచుగా కృత్రిమ రుచులు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడతాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఓవర్‌డ్రైవ్‌లో ఆమ్లతకు కారణమవుతాయి.
 
 పైగా అప్పడాలను నూనెలో వేసి వేయించడం వల్ల కొవ్వు తీసుకోవడం పెరుగుతుంది. కొన్నిసార్లు ఇవి క్యాన్సర్ సమస్యకు కూడా దారితీసే అవకాశాలు లేకపోలేదు.
 
13 గ్రాములున్న అప్పడంలో 35 నుంచి 40 కేలరీలు వుంటాయి. ప్రోటీన్లు 3.3 గ్రాములుంటే కొవ్వు 0.4 గ్రాములుంటుంది. అలాగే 7.8 గ్రాములు కార్బోహైడ్రేట్లు వుంటాయి. అన్నిటికీ మించి ఇందులో 226 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది. కనుక అప్పడాలు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్క్ ఫ్రమ్ హోమ్.. మహిళలు బరువు పెరిగిపోతారు జాగ్రత్త.. ఇలా చేస్తే..?