Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత కొత్త రెసిపీ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్

Advertiesment
సమంత కొత్త రెసిపీ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:03 IST)
ఉపాసన కొణిదెల "యువర్ లైఫ్" వెబ్ పోర్టల్‌కు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ నాయిక సమంత కొత్తకొత్త రెసిపీలను వ్యూయర్స్‌కు పరిచయం చేస్తున్నారు. "స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్" సెక్షన్లో హెల్దీ అండ్ టేస్టీ వంటలతో ఆమె మంచి చెఫ్ అనిపించుకుంటున్నారు.
 
ఉపాసనతో కలిసి సమంత చేస్తున్న రుచికరమైన వంటలతో పాటు వంటలు చేస్తున్నప్పుడు వారిద్దరి సరదా సంభాషణ మరింత ఆకర్షిస్తోంది. "స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్"లో సమంత వేగాన్ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్ చేశారు. ఇందుకు కొబ్బరి పాలు, డార్క్ కొకోవా పొడి, ఫిల్టర్ కాఫీ డికాక్షన్, వెనీలా, మాపుల్ సిరప్ లేదా బెల్లం సిరప్, సబ్జా గింజలను కలిపి రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా చాలు సులువైన రుచికరమైన రెసిపీ తయారు చేశారు సమంత.
 
మరుసటి రోజు ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ రుచి చూడటం ప్రారంభించి గ్లాస్‌లో ఉన్న ఫుడ్డింగ్ మొత్తం తినేసేదాక ఆపలేదు సమంత. అంత రుచిగా ఆమెకు నచ్చిందా రెసిపీ. ఈ సందర్భంగా ఉపాసనతో మాట్లాడుతూ.. తాను ప్యూర్ వెజిటేరీయన్ అని తెలిపింది సమంత.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు ఇండస్ట్రీ (SPB) బాలుని మరచిపోయిందా..?