Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ ఉదయాన్నే ఎండుద్రాక్షాలు తీసుకుంటే?

ఎండుద్రాక్షాలను పలురకాల స్వీట్లలో వంటకాల్లో వాడుతుంటాం. వీటి వలన వంటకాలకు చక్కని రుచి వస్తుంది. ఈ ఎండుద్రాక్షాలలో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి అవేంటే తెలుసుకుందాం. ఈ ఎండుద్రాక్షాలను రాత్రంతా

Webdunia
శనివారం, 28 జులై 2018 (10:40 IST)
ఎండుద్రాక్షాలను పలురకాల స్వీట్లలో వంటకాల్లో వాడుతుంటాం. వీటి వలన వంటకాలకు చక్కని రుచి వస్తుంది. ఈ ఎండుద్రాక్షాలలో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి అవేంటే తెలుసుకుందాం. ఈ ఎండుద్రాక్షాలను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.
 
ఈ ఎండుద్రాక్షాలలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. రక్తహీనతను నివారించుటలో సహాయపడుతుంది. ఈ ద్రాక్షాలలో విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులకు ఈ ఎండుద్రాక్షాలు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఉత్తేజంగా ఉంటారు. ఒక రోజున కావలసిన శక్తిని అందిస్తుంది. 
 
ఈ ఎండుద్రాక్షాలు తీసుకోవడం వలన ఉద్యోగులు, పిల్లలు అనారోగ్య సమస్యల నుండి విముక్తి చెందుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువును కూడా సులభంగా తగ్గించుటలో ఎంతగానో దోహదపడుతుంది. ఎండుద్రాక్షాలతో పాటు వెల్లుల్లిని కూడా పచ్చిగా తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. 
 
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పలు రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. వీటిని తీసుకోవడం వలన జీర్ణ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. పలు రకాల ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడేవారు ఎండుద్రాక్షాలు తీసుకుంటే అలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments