Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోంపు వాడితే ఆ విషయంలో వందమార్కులు..!

ప్రకృతి సహజసిద్థంగా పండే వాటిలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. శరీరానికి ఎలాంటి కీడు చేయకుండా ఆరోగ్యంగానే ఉండే విధంగా సోంపు ఎంతో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సోంపును చాలామంది మౌత్ ఫ్రెష్‌నర్‌గా ఉపయోగిస్తారు. కొంతమం

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (18:33 IST)
ప్రకృతి సహజసిద్థంగా పండే వాటిలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. శరీరానికి ఎలాంటి కీడు చేయకుండా ఆరోగ్యంగానే ఉండే విధంగా సోంపు ఎంతో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సోంపును చాలామంది మౌత్ ఫ్రెష్‌నర్‌గా ఉపయోగిస్తారు. కొంతమంది తిన్న తరువాత ఆహారం జీర్ణమయ్యేందుకు సోంపును వాడుతారు. అయితే ఇదే కాదు.. ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా సోంపుతో చేసిన టీని ప్రతి రోజు తాగినట్లయితే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చట. 
 
ఒక కప్పు మరుగుతున్న నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి పదినిమిషాల వరకు మరిగించాలి. ఆ తరువాత టీ నుంచి సోంపు గింజలను వడబోసి ఆ నీటిని తాగాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆహారం తిన్న తరువాత ఈ టీని తాగితే మనకు కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. సోంపు టీ తాగితే కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాల్లో ఏర్పడే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయట. జీర్ణాశయం శుభ్రమవుతుంది, గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా స్త్రీలో రుతు సంబంధ సమస్యలు తొలగిపోతాయట. 
 
పాలిచ్చే తల్లులు తాగితే పాలు బాగా పడతాయట. అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుందట. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయట. మంచి బాక్టీరియా వృద్ధి చెందుట. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. ఒంట్లో అధికంగా ఉన్న నీరు మూత్రం రూపంలో బయటకు పోతుందట. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. కిడ్నీల్లో రాళ్ళుంటే కరిగిపోయి మూత్రం ధారాళంగా వస్తుందట. యాంటీ ఇంఫ్లమేటరి గుణాలు ఉండడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గి కీళ్ళ నొప్పులు ఉన్న వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments