Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీలకర్ర, బెల్లం, ధనియాలు కలిపి నూరి గుళికల్లా చేసుకుని మింగితే...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (23:11 IST)
మన వంట గదిలో వుండే దినుసులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ధనియాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్నచిన్న గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.

2. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.

3. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతూంటే నివారణ కల్గుతుంది.

4. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.

5. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే  పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయమవుతుంది.

6. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని… ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.

7. వేసవిలో విపరీతమైన దాహం ఉంటుందిగానీ ఆకలి తక్కువ. ఉదయాన్నే ధనియాలు తీసేసిన
ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది.

8 షుగర్, బీపీలను కంట్రోల్‌లో ఉంచుతుంది. 

9. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు.. స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments