Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 6 రకాల కూరగాయలు వేసవిలో తీసుకుంటే చాలు...

వేసవికాలం వచ్చిందంటే మన శరీరంలోని నీటిశాతం తగ్గుతుంది. మరి... నీటిశాతం పెంచుకోవడానికి మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వేసవికంటూ ప్రత్యేకంగా కూరలేముంటాయి అనుకుంటాము. కానీ కొన్ని రకాల కూరగాయలు వేసవిలో ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఆరోగ్య

Webdunia
బుధవారం, 9 మే 2018 (22:29 IST)
వేసవికాలం వచ్చిందంటే మన శరీరంలోని నీటిశాతం తగ్గుతుంది. మరి... నీటిశాతం పెంచుకోవడానికి మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వేసవికంటూ ప్రత్యేకంగా కూరలేముంటాయి అనుకుంటాము. కానీ కొన్ని రకాల కూరగాయలు వేసవిలో ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
 
1. నీటిశాతం ఎక్కువగా ఉండే సొరకాయ శరీర ఉష్ణోగ్రతనీ కడుపులో మంటని తగ్గిస్తుంది. చెమట ద్వారా సోడియం పోకుండా చేస్తుంది. మధుమేహాన్ని, బీపీనీ అదుపులో ఉంచుతుంది. శరీరంలోని నీటిశాతాన్ని పెంచుతుంది. 
 
2. పొట్లకాయ తినడం వల్ల శరీరం పొడిబారకుండానూ, చల్లగానూ ఉండేలా చేస్తుంది.
 
3. బూడిదగుమ్మడి వడదెబ్బ నుండి రక్షిస్తుంది. బీపీతో పాటు ఆస్తమా, రక్త సంబందిత వ్యాధులు, మూత్ర సమస్యలూ ఇలా ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుంది.
 
4. బీరకాయ రక్తశుద్ధికి, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
5. చల్లదనాన్నిఇవ్వడంతో పాటు మూత్ర సమస్యల్నీ తగ్గించేలా చేసేదే గుమ్మడి. ఇది పొట్టలోని నులిపురుగుల సమస్యను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. చక్కెర వ్యాధిని, బీపీనీ అదుపులో ఉంచడంతో పాటు చర్మవ్యాధులు రాకుండా చేస్తుంది.
 
6. కాకరకాయ చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వేడి పొక్కులూ, చెమటకాయలూ, దద్దుర్లు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments