Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తే...?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (20:37 IST)
భారతీయులు తప్పనిసరిగా వామును వంట ఇంటిలో ఉపయోగిస్తుంటారు. ఇది భారతీయులకు తెలిసిన గొప్ప ఔషధం. సాధారణంగా వామును జంతికలు చేసినపుడు వాడుతుంటాము. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా వుంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా వుంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది.' మరి వాములో ఉండే ఔషధ గుణాలు ఏమిటో చూద్దాం. 
 
1. జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
 
2. వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
 
3. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
 
4. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల రోగం తగ్గుతాయి.
 
5. వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
 
6. వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments