Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జొన్నలు ఎంత బలమో తెలుసా?

జొన్నలు ఎంత బలమో తెలుసా?
, గురువారం, 10 జనవరి 2019 (22:13 IST)
మన శరీరానికి కావలసిన  పోషకాలు అందించడంలో జొన్నలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పూర్వ కాలంలో జొన్నలను ఆహారంలో భాగంగా ఎక్కువగా ఉపయోగించేవారు. జొన్న సంకటి, జొన్న రొట్టెలు లాంటివి చేసుకుని తినేవారు. అందువల్ల అప్పట్లో ఎక్కువమంది వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుత కాలంలో సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక రకములైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జొన్నలు వాడకం బాగా తగ్గింది. ఇందులో అనేక రకములైన పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 
1. జొన్నల్లో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థం, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్ బి1, బి2, బి3, బి5 వంటి విటమిన్లు క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
 
2. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉండటంతో జొన్నలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని చెడు కొవ్వుని నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 
3. జొన్నల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ జొన్నలని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జొన్నలు త్వరగా ఆకలి కాకుండా చూస్తాయి.
 
4. జొన్నల్లో నియాసిన్ అనే బి6 విటమిన్ ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అయ్యి శక్తిలాగా మారడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల శరీరంలోని క్యాలరీలు పేరుకుపోకుండా ఉంటాయి. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. 
 
5. జొన్నలు బాలింతలకు చాలా మంచివి. వీటిల్లో ఉండే ప్రోటీన్సు పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడతాయి.
 
6. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను దూరం చేసేందుకు జొన్నలు ఎంతగానో సహకరిస్తుంది. అందుకే సరైన ఆరోగ్యానికి జొన్నలు చాలా అవసరం. 
 
7. జొన్నలు శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రోటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్త వృద్ధికి తోడ్పడే ఇనుము, ఫోలిక్ ఆమ్లాన్ని శరీరానికి అందిస్తుంది. అయితే ఇతర ధాన్యాల కన్నా జొన్నల్లో ఇనుము, జింక్ ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారం అనగానే పాపను లేపుతున్నాడు... కోర్కెతో రగిలిపోతున్నాను...