Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో సింక్రోనీ సాంకేతికతతో మొట్టమొదటి రాడిక్జాక్ట్‌ వ్యవస్థను ఆవిష్కరించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:05 IST)
భారతదేశంలో రెండవ అతి పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ శ్రేణి, మణిపాల్‌ హాస్పిటల్స్‌, క్యాన్సర్‌ రోగులకు ఖచ్చితమైన చికిత్సనందించడం కోసం మొట్టమొదటిసారి అనతగ్గ సింక్రోనీ ఆటోమేటిక్‌, రియల్‌ టైమ్‌ మోషన్‌ సింక్రోనైజేషన్‌ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక రాడిక్జాక్ట్‌ సిస్టమ్‌ను సమకూర్చుకుంది. సింక్రోనీ ట్యూమర్‌ ట్రాకింగ్‌ సాంకేతికతతో రాడిక్జాస్ట్‌ ఎక్స్‌9 టోమోథెరఫీ కోసం ఏఈఆర్‌బీ నుంచి అవసరమైన అనుమతిని మణిపాల్‌ హాస్పిటల్స్‌ అందుకుంది. భారతదేశంలో ఈ సదుపాయం కలిగిన మొట్టమొదటి మెషీన్‌ ఇది. యుఎస్‌, యుకె, జపాన్‌ మరియు హాంగ్‌కాంగ్‌ తరువాత  నూతన రాడిక్జాక్ట్‌ సిస్టమ్‌ను పొందిన ప్రపంచంలో మొట్టమొదటి అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా.
 
సింక్రోనీ సాంకేతికతతో కూడిన తమ నూతన తరపు టోమోథెరఫీతో రాడిక్జాక్ట్‌ సిస్టమ్‌, క్యాన్సర్‌ రోగుల అవసరాలకు తగిన రీతిలో మహోన్నతమైన క్లీనికల్‌ ఫలితాలను తల, మెడ, రొమ్ము, వీర్యగ్రంథి (ప్రోస్టేట్‌) క్యాన్సర్‌లకు అందిస్తుంది. దేశంలో కనిపిస్తున్న మొత్తం క్యాన్సర్‌లలో 85% ఈ క్యాన్సర్‌లే కనిపిస్తున్నాయి. ఈ సిస్టమ్‌ మొత్తం శరీరం కోసం 360 డిగ్రీ రొటేషనల్‌ డెలివరీ అందిస్తుంది. ఇటెరేటివ్‌ రీకన్‌స్ట్రక్షన్‌తో సీటీ ఆధారిత డెయిటీ  ఐజీఆర్‌టీని సైతం అందిస్తుంది. ఈ సమ్మిళిత సాంకేతికతలు విభిన్నమైన పద్ధతులను వినియోగించుకుని, ఇమేజ్‌ గైడెడ్‌ ఇంటెన్సిటీ-మాడ్యులేటెడ్‌ రేడియేషన్‌ థెరఫీ (ఐజీ-ఐఎంఆర్‌టీ) నుంచి స్టెరోటాక్టిక్‌ బాడీ రేడియేషన్‌ థెరఫీ (ఎస్‌బీఆర్‌టీ) వరకూ ఎలాంటి కణితికి అయినా, అంటే ఆఖరకు అవి కదులుతున్నా సరే , అతి ఖచ్చితమైన, అపూర్వమైన సౌకర్యంతో చికిత్సను అందించే రీతిలో రేడియేషన్‌ను విడుదల చేస్తుంది.
 
డాక్టర్‌ వాధిరాజా బీ ఎం, హెచ్‌ఓడీ అండ్‌ కన్సల్టెంట్- రేడియోథెరఫీ, మణిపాల్‌ హాస్పిటల్స్, మాట్లాడుతూ ‘‘ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోని అత్యుత్తమ చికిత్స, సంరక్షణను రోగులకు అందించేందుకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ సింక్రోనీ సాంకేతికత, క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులను క్యాన్సర్‌ రోగులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా తీసుకురాగలదని అంచనా వేస్తున్నారు. రాడిక్జాక్ట్‌ సిస్టమ్‌ కోసం సింక్రోనీ, డాక్టర్లకు అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా రేడియేషన్‌ థెరఫీ అవసరమైన క్యాన్సర్‌ రోగులకు, మరీ ముఖ్యంగా శ్వాసిస్తున్నప్పుడు కణితి కదులుతున్న వారికి చికిత్సనందించడంలో  సహాయపడగలదు’’ అని అన్నారు.
 
మణిపాల్‌ హాస్పిటల్స్‌ బెంగళూరు, ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద నున్న రేడియేషన్‌ ఆంకాలజీ బృందం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓ రోగికి యాక్యురే యొక్క రాడిక్జాక్ట్‌ సిస్టమ్‌ విత్‌ సింక్రోనీ మోషన్‌ ట్రాకింగ్‌, కరెక్షన్‌ టెక్నాలజీ వినియోగించి చికిత్స అందించింది. ఈ రోగి 51 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. ఆమెకు మూత్రపిండ క్యాన్సర్‌ కణం నుంచి పాకిన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారామె.
 
డాక్టర్‌ వాధిరాజా బీఎం, హెచ్‌ఓడీ అండ్‌ కన్సల్టెంట్‌ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ మాట్లాడుతూ, రాడిక్జాక్ట్‌9 సిస్టమ్‌ పై సింక్రోనీ టెక్నాలజీ  ద్వారా ఊపిరితిత్తులలో వాస్తవ సమయంలో కణితిని గుర్తించగలం. ఊపిరితిత్తులలో కణితులు రోగి శ్వాసతో పాటుగా పైకి కిందకూ కలుతుంటుంది. ఇలాంటి కణితిలను గుర్తించడంతో పాటుగా ఆటోమేటిక్‌గా రేడియేషన్‌ బీమ్‌ను ఖచ్చితంగా గుర్తించడంతో పాటుగా కదులుతున్న కణితిలకు సైతం సరైన చికిత్పను అందించడం వీలవుతుంది. ఈ సాంకేతికత సహాయంతో కణితి చుట్టూ అందించిన అదనపు మార్జిన్‌ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. తద్వారా చుట్టూ ఉన్న సాధారణ ఊపిరితిత్తికి రేడియేషన్‌ మోతాదు తగ్గించడం వీలవుతుంది మరియు చివరకు, క్యాన్సర్‌ కణజాల నాశనం కోసం అవసరమైన అత్యధిక మోతాదును నేరుగా అందించడం వీలవుతుంది.
 
రాడిక్జాక్ట్‌ 9పై సింక్రోనీ టెక్నాలజీ ప్రయోజనాలలో ...
1. ఊపిరితిత్తుల క్యాన్సర్‌, కాలేయ, పాన్‌క్రియాస్‌, ప్రోస్టేట్‌ లాంటి శ్వాసతో పాటుగా కదిలే క్యాన్సర్‌ కణజాలాన్ని గుర్తించి, చికిత్సనందించడం వీలవుతుంది (ప్రైమరీ లేదా మెటస్టాటిక్‌).
 
2. శ్వాసతో పాటుగా కదిలే క్యాన్సర్‌ చికిత్సల కోసం అందుబాటులో ఉన్న ప్రస్తుత రేడియేషన్‌ చికిత్సా సాంకేతికతలతో పోలిస్తే మొత్తంమ్మీ చికిత్స సమయం తగ్గుతుంది.
 
3. శ్వాసతో పాటుగా కదిలే కణితికి రేడియేషన్‌ ఖచ్చితంగా అందించడం వల్ల రోగికి సహజసిద్ధంగా శ్వాస తీసుకోవడంలో సౌకర్యం కలుగుతుంది.
 
తమ ముందస్తు సాంకేతికతలకు పూర్తి భిన్నమైనది సింక్రోనీ సాంకేతికత. ఈ సాంకేతికతతో హాస్పిటల్‌ బృందాలు అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన రేడియేషన్‌ను శ్వాసిస్తున్నప్పుడు కదులుతున్న కణితి ఉన్న ఉన్న ప్రాంతంలో అందించగలవు. తద్వారా కణితి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన కణజాలానికి కలిగించే నష్టాన్నీ తగ్గించవచ్చు. సాధారణంగా అత్యధిక మోతాదు కలిగిన రేడియేషన్‌ ప్రభావానికి ఈ ఆరోగ్యవంతమైన కణజాలం గురైనప్పటికీ, రోగికి అతి తక్కువ అసౌకర్యం కలిగిస్తుంది. రోగి శ్వాసించినప్పుడు, కణితి కూడా కదులుతుంటుంది. అత్యధిక మోతాదు రేడియేషన్‌ చికిత్స చేస్తున్నప్పుడు ఇది అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు. అయితే, సింక్రోనీ సాంకేతికతతో, ఈ కణితి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడంతో పాటుగా తమ స్థానాన్ని 0.3 సెకన్ల అనుకూల సమయంలో సరిచేసుకుని అత్యంత ఖచ్చితత్త్వంతో మోతాదును, రోగికి అతి తక్కువ అసౌకర్యం లేదా అపాయం కలిగిస్తూ అందిస్తుంది. రాడిక్జాక్ట్‌ సింక్రోనీని ప్రధానంగా మల్టీ సెంట్రిక్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌, మల్టిపుల్‌ మెటాస్టసీస్‌, లివర్‌ మెటాస్టసీస్‌ మరియు స్టీరియోటాక్టిక్‌ థెరఫీలలో వినియోగిస్తారు.
 
ప్రతి క్యాన్సర్‌ రోగికీ అత్యుత్తమ చికిత్సనందించేందుకు తమ వద్ద ఉన్న సాంకేతికతలను నిరంతరం మణిపాల్‌ హాస్పిటల్స్‌ అప్‌గ్రేడ్‌ చేస్తూనే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: డిసెంబర్ 24 నుంచి కడప జిల్లాల్లో జగన్ పర్యటన

Vijayashanti: పుష్ప-2 తొక్కిసలాట.. రాజకీయం చేయొద్దు.. విజయశాంతి

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai pallavi : గంగమ్మను దర్శించుకున్న సాయిపల్లవి.. చెల్లెలతో బీచ్‌లో ఎంజాయ్ చేసింది.. (video)

Ramcharan, Allu arjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

తర్వాతి కథనం
Show comments