Webdunia - Bharat's app for daily news and videos

Install App

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (18:46 IST)
విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌ వైద్యపరంగా మరొక అద్భుతమైన విజయం సాధించింది. 86 ఏళ్ల వ్యక్తికి చాలా కాలంగా మింగడంలో ఇబ్బందిగా ఉండేది, మింగిన ఆహారం నోటిలోకి తిరిగి రావడం, రాత్రిపూట దగ్గు కూడా ఉన్నాయి. వీటి వల్ల ఆ వ్యక్తి బరువు తగ్గిపోవడం, గణనీయమైన బలహీనత ఏర్పడింది. ఈ సమస్యలతో మణిపాల్ హాస్పిటల్ విజయవాడకి వచ్చారు.
 
మొదటగా రోగికి వయస్సు రీత్యా అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అనుకున్నాము. పరీక్షల్లో (Endoscopy) ఆహారం అన్నవాహికలో ఇర్కుక్కొని ఉన్నట్లు తేలింది కానీ క్యాన్సర్ సంకేతాలు లేవు. ఛాతి యొక్క కాంట్రాస్ట్-ఎన్‌హాన్స్డ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CECT) ద్వారా అన్నవాహికలోగాని చాతిలో గానీ కణితులు ఏమి లేవని తెలిసింది. హై-రిజల్యూషన్ ఎసొఫాజియల్ మానోమెట్రీ ద్వారా పరీక్షల్లో అతనికి అకలేసియా కార్డియా ఉందని నిర్ధారించబడింది.
 
అకలేసియా కార్డియా అనేది ఒక అరుదైన వ్యాధి. దీనిలో అన్నవాహిక యొక్క నరాలు దెబ్బతినడం వల్ల అన్నవాహికలో ఆహారం క్రిందికి కదలడానికి కష్టమవుతుంది. మింగడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు వస్తాయి. అభలేనియా కార్డియాకు మూడు ప్రధాన చికిత్సలు ఉన్నాయి: న్యూమాటిక్ డైలేషన్, లాపరోస్కో పిక్ హెల్లర్స్ మయోటమీ, పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (POEM). ప్రతి చికిత్సలో నష్టాలు, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, రోగి వయస్సు, శస్త్రచికిత్సలో ఉండే అధిక ముప్పు అవకాశాల కారణంగా అధునాతన (Endoscopy) విధానం ద్వారా చికిత్స చేయడానికి నిర్ణయించాము.
 
మణిపాల్ హాస్పిటల్‌లో మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో కన్సల్టెంట్లు అయిన డాక్టర్ బత్తిని రాజేష్, డాక్టర్ రాజేష్ చంద్ర నిర్వహించారు.ఈ ప్రక్రియకు దాదాపు గంటసేపు పట్టింది. ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తయింది. శస్త్రచికిత్స తర్వాత, రోగిని ఒక రోజు పాటు నోటి ద్వారా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉంచాము, తరువాత క్రమంగా ద్రవాలు, మెత్తటి ఆహారానికి మార్చారు. అతనికి జ్వరం, ఛాతీ నొప్పి లేదా ఇతర సమస్యలు ఏవీ రాలేదు. రోగిని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేశారు.
 
రోగి త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ ఆహారం తీసుకో గలిగాడు. క్రమంగా బరువు పెరగడం ప్రారంభమైంది. తదుపరి ఎండోస్కోపీలో అన్నవాహికలో ఆహారం నిల్వ ఉండటం లేదు. ‘‘పీఓఈఎం అనేది అకలేసియా కార్డియాకు, ముఖ్యంగా శస్త్రచికిత్సతో అధిక ముప్పు అవకాశాలను ఎదు ర్కొనే రోగులకు అంటే వృద్ధ వయస్సు గలవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్స’’ అని మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ బత్తిని రాజేష్ పేర్కొన్నారు. ఈ కేసులో వృద్ధులతో సహా అన్ని వయసులవారిలో పీఓఈఎం ప్రభావాన్ని ప్రముఖంగా చాటిచెబుతుంది. ‘‘ఈ విజయవంతమైన చికిత్సా విధానము మణిపాల్ హాస్పిటల్స్‌లో మా అధునాతన సామర్థ్యాలను నొక్కి చెబుతుంది" అని మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ చంద్ర అన్నారు.
 
విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, మణిపాల్ హాస్పిటల్‌లో, ఈ 86 ఏళ్ల రోగిలో పీఓఈఎం విధానాన్ని విజయవంతంగా చేయడం వల్ల అకలేసియా కార్డియా వంటి సంక్లిష్ట సమస్యలను పరీక్షించడంలో మా ప్రత్యేక సామర్థ్యాలు ప్రముఖంగా వెల్లడించింది’’ అని అన్నారు. ఈ విజయవంతమైన కేసు విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌లోని అధునాతన నైపుణ్యం, వినూత్న విధానాలను చాటిచెబుతుంది. అంతేగాకుండా ఇది సంక్లిష్టమైన అన్నవాహిక రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు కొత్త ఆశను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

తర్వాతి కథనం
Show comments