Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కులో స్ప్రే చేస్తే చాలు, కరోనా వైరస్ చచ్చిపోతుందట, కానీ...

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (21:20 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు మందును కనిపెట్టాలని ప్రపంచ దేశాల్లోని సైంటిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రయోగదశలో వున్నాయి. మరికొన్నింటిని ప్రయోగించారు. ఫలితాలు ఆశించినస్థాయిలో వస్తే ఇక కరోనా వైరస్ పైన విజయం సాధించినట్లే. 
 
ఇకపోతే వాటర్లూ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ప్రత్యేకమైన టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు, ఐతే ఇంకా ఇది ఫైనలైజ్ కాలేదు. DNA- ఆధారిత టీకా హోస్ట్ బాడీలో ఉన్న బ్యాక్టీరియాలో ప్రతిబింబిస్తుంది. ఇది COVID-19 కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేయడానికి నాసికా కుహరం, తక్కువ శ్వాసకోశంలోని కణజాలాలను లక్ష్యంగా చేసుకుంటూ పని చేస్తుంది. ఇటువంటి ప్రక్రియను బాక్టీరియోఫేజ్ అంటారు. జస్ట్, ముక్కు రంధ్రాల్లో మందును స్ప్రే చేయడం ద్వారా కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చని అంటున్నారు. 
 
కోవిడ్ 19కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేయడానికి, టీకా లక్ష్యంగా ఉన్న కణజాలాలలో వైరస్ లాంటి కణాన్ని ఈ టీకా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా మానవ శరీరంలో ఇంజెక్ట్ చేసిన వ్యాధికి కారణమయ్యే వైరస్ లేదా బ్యాక్టీరియా పైన ఇది పోరాడుతుంది. వైరస్‌ను అడ్డుకునేందుకు అవరసమైన రోగనిరోధక శక్తిని ఇది కలిగిస్తుంది. ఐతే ప్రస్తుతం ఇది ప్రయోగదశలో వున్నట్లు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments