స్మార్ట్ ఫోన్‌తో పుర్రె వెనుకభాగంలో కొమ్ములు...

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (14:04 IST)
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారా? ముఖ్యంగా, గంటల కొద్ది తలవంచి స్మార్ట్‌ఫోనునే చూస్తున్నారా? అయితే, మీ పుర్రె వెనుక భాగంలో కొమ్ములు వచ్చివుంటాయి. ఓసారి వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి. లేదంటే ప్రాణాపాయం తప్పదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. ఆస్ట్రేలియా పరిశోధకులు. 
 
గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్ చూసేందుకు మెడ భాగాన్ని అలా ఎక్కువసేపు వంచి ఫోన్‌ తెర వైపే చూస్తూ గడపడం వల్ల.. అక్కడి కండరాలపై అదనపు ఒత్తిడి పడి.. పుర్రె వెనుక దిగువ భాగంలో ఎముక పెరుగుతోందని (బోన్‌ స్పర్స్‌) ఆస్ట్రేలియా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రజ్ఞులు వీటిని 'ఎంథియోసోఫైట్స్'గా పేర్కొంటున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ద సన్‌షైన్‌ కోస్ట్‌లో హెల్త్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డేవిడ్‌ షహర్‌, ఆయన సహచరుడు మార్క్‌సేయర్స్‌ 2016లో.. 1200 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయన ఫలితం 2018లోనే 'సైంటిఫిక్‌ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమైనా.. అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పలువురు స్మార్ట్  ఫోన్ వినియోగదారుల్లో ఈ సమస్య ఉత్పన్నంకావడంతో దీనిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోతులను బ్యాగులో పెట్టి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చాడు.. చివరికి?

సరిగా చదవడం లేదని అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్

నా పరువు తీస్తున్నారు... వారిపై చర్యలు తీసుకోండి : ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన పవర్ స్టార్

నేను ఏదో ఒకరోజు తెలంగాణ సీఎం అవుతా, వారి తాట తీస్తా: కల్వకుంట్ల కవిత

బావ సర్టిఫికేట్లు వాడుకొని డాక్టరుగా చెలామణి అవుతున్న బామ్మర్ది... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments