ఆది మానవుడు చింపాంజీ నుంచి మానవుడిగా మారాడని అంటుంటారు. అలాంటి మానవుడు అంచెలంచెలుగా తన బుద్ధి వికాసంతో ఎన్నెన్నో కనుగొన్నాడు. ఆధునిక యుగానికి చేరుకున్నాడు.
ప్రస్తుతం మానవుడు అతిగా ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అసలు సంగతి ఏంటంటే.. మానవుడు ఉపయోగించే ఈ సోషల్ మీడియాను ప్రస్తుతం ఓ చింపాంజీ ఉపయోగిస్తుంది. అదీ ఇన్‌స్టాగ్రామ్‌ను చింపాంజీ ఉపయోగించే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫోటోలను పోస్టు చేస్తుంటారు. అలాంటి పాపులర్ యాప్‌ను చింపాంజీ ఉపయోగిస్తుంది. తన సెల్ ఫోన్‌లో ఈ యాప్‌ను యూజ్ చేస్తోంది. మైక్ హాల్‌స్టన్ అనే పేరిట గల ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే చింపాంజీ కోతి వీడియో షేర్ అయ్యింది.
ఈ వీడియోకు భారీగా లైకులు వచ్చేశాయి. మానవులకు ధీటుగా ఈ చింపాంజీ ఇన్‌స్టాగ్రామ్‌ను వాడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తుంటే నెటిజన్లు షాకయ్యారు. ఈ వీడియోను పోస్టు చేసిన గంటల్లోనే 60లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోకు లైకులు, షేర్లు, కామెంట్లు పెచ్చరిల్లుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.