Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత కరెన్సీ నోట్లతో జాగ్రత్త... ఆ నోట్లు వ్యాధులను మోసుకొస్తాయ్ జాగ్రత్త

పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు పూర్తిస్థాయిలో విడుదలవుతున్నాయి. ఐతే ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొస్తాయంటే నమ్మబుద్దికాదు కానీ, ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ డజన్లకొద్దీ కరెన్సీ నోట్లను అంటిపెట్టుక

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (22:58 IST)
పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు పూర్తిస్థాయిలో విడుదలవుతున్నాయి. ఐతే ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొస్తాయంటే నమ్మబుద్దికాదు కానీ, ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ డజన్లకొద్దీ కరెన్సీ నోట్లను అంటిపెట్టుకుని ఉంటాయట. రూ. 10, రూ. 20, రూ. 100 కరెన్సీ నోట్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు ఢిల్లీకి చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. ఈ కరెన్సీ నోట్ల కారణంగా సుమారు 78 వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ గుర్తించింది. 
 
వీటిలో చాలామటుకు ఫంగై, బ్యాక్టీరియా కారక రూపంలో నోట్లను అంటిపెట్టుకుని ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. వీటి ఫలితంగా డీసెంట్రీ, ట్యుబర్కులోసిస్, అల్సర్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదని చెపుతున్నారు. ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొచ్చే వాహకాలుగా కూడా పనిచేసే అవకాశం ఉందని చెపుతున్నారు. 
 
ఐతే వాస్తవ రూపంలో ఇవి మనుషులపైన ఎంతమేరకు ప్రభావం చూపుతాయన్నది ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఐతే అవకాశం లేదని చెప్పలేమని కూడా అన్నారు. కరెన్సీ నోట్లను స్నాక్ దుకాణాలు, రోడ్లపై నడిపే దుకాణాదారులు, మార్కెట్లు వంటి వారి వద్ద నుంచి సేకరించి పరిశీలించినట్లు వారు తెలిపారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments