Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్యు ఆధారిత టీకాతో కరోనాకు చెక్ - తొలుత జంతువులపై ప్రయోగం

Webdunia
గురువారం, 7 మే 2020 (11:28 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు అనేక ప్రపంచ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ పరిశోధనల్లో భాగంగా, కరోనాకు సరైన వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, అమెరికాకు చెందిన మాసాచ్యూసెట్స్ ఆస్పత్రి ఓ పరిశోధన చేస్తోంది. 'ఆవ్​ కొవిడ్' పేరిట జరుగుతున్న ఈ ప్రయోగం ద్వారా జన్యు ఆధారిత టీకా తయారు చేస్తున్నట్టు తెలిపారు. 
 
ఇందుకుసంబధించి ప్రస్తుతం జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని వెల్లడించింది. త్వరలోనే మానవులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ టీకాకు సంబంధించిన ప్రయోగాలు, అభివృద్ధి వివరాలను ఇటీవల వెల్లడించింది. జన్యు మార్పిడి ఆధారిత ఈ టీకాలో అడినో-అసోసియేటెట్‌ వైరస్‌(ఏఏవీ)లు ఉంటాయి. ఇతర వ్యాధులకు కారణం కాకుండా మనుషులపై ప్రభావం చూపే వైరస్‌లనే ఏఏవీలు అంటారు. 
 
కణాల్లోకి ఇతర జన్యు పదార్థాన్ని చొప్పించేందుకు శాస్త్రవేత్తలు 'వైరల్‌ వెక్టార్స్‌' అనే పరికరాలను ఉపయోగిస్తారు. ఈ పరిజ్ఞానంతో శరీరంలోకి కరోనా వైరస్‌ కొమ్ము(స్పైక్‌) ప్రతిజనకాన్ని (యాంటీజన్‌) పంపిణీ చేస్తారు. ఇది దేహంలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక స్పందనను అభివృద్ధి చేస్తుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments