Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంత సిరి : చెన్నై బాలుడి దవడలో 526 దంతాలు

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (15:44 IST)
సాధారణంగా ప్రతి వ్యక్తికి 32 పళ్లు ఉంటాయి. అందుకే ఎవరికైనా కోపం వస్తే కొడితే 32 పళ్లు రాలిపోతాయని అంటుంటారు. కానీ, ఆ బాలుడుకు మాత్రం ఏకంగా 526 దంతాలు ఉన్నాయి. దీంతో ఆ దంతాలను ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. చెన్నైలో వెలుగు చూసిన ఈ దంత సిరి ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నైకు చెందిన ఏడేళ్ళ బాలుడు రవీంద్రనాథ్. ఈ బాలుడుకు పదేపదే దవడ నొప్పి వస్తూ ఉండేది. ఇటీవల తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటంతో నగర శివారు ప్రాంతంలో ఉన్న సవిత దంత వైద్య కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలుడికి వివిధ పరీక్షలు చేసిన వైద్యులు... కింది దవడ కుడిభాగంలో సంచిలాంటి నిర్మాణం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. 
 
వీటిని తొలగించాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందేనంటూ వైద్యులు స్పష్టంచేశారు. ఆ తర్వాత ఆ బాలుడు తల్లిదండ్రుల అనుమతి మేరకు ఐదుగురు దంత వైద్యులు, ఏడుగురు పాథాలజిస్టులు, ఇతర సహాయక సిబ్బంది కలిసి మొత్తం ఐదు గంటల పాటు శ్రమించి అదనంగా ఉన్న దంతాలను తొలగించారు. 
 
ఆ తొలగించిన దంతాలను లెక్కించగా అవి 526గా ఉన్నాయి. ఈ దంతాలను చూసిన వైద్యులు.. కేవలం వైద్యులే కాదు బాలుడు కూడా ఆశ్చర్యపోయారు. గతంలో ముంబైకు చెందిన ఓ యుక్తవయసు బాలుడుకి 232 దంతాలున్న విషయాన్ని వైద్యులు గుర్తించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments