Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ఎముకలకు శృంగారంతో బలమేనట...

మూడు పదుల వయస్సు రావడంతో మహిళల్లో ఎముకల బలం తగ్గుతూ వస్తుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోవడం కారణంగా చాలామంది మహిళలు ఆస్టియోపోరోసిస్ బారినపడుతుంటారు. ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా తప్పి

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (13:35 IST)
మూడు పదుల వయస్సు రావడంతో మహిళల్లో ఎముకల బలం తగ్గుతూ వస్తుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోవడం కారణంగా చాలామంది మహిళలు ఆస్టియోపోరోసిస్ బారినపడుతుంటారు. ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే.. వారంలో కనీసం రెండుసార్లైనా మహిళలు శృంగారంలో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మిగిలినవాళ్ల శాతంకన్నా రెట్టింపు ఉంటుంది. దాంతో ఎముకలకు బలం చేకూరుతుంది. అంతేగాకుండా వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో పక్షవాతం, గుండెజబ్బులు కూడా రావని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మహిళల అందానికి కూడా శృంగారం ఎంతో మేలు చేస్తుందట.
 
వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి.. క్రీములు, కాస్మెటిక్స్ అవసరం లేదని ఇప్పటికే అధ్యయనాలు కూడా తేల్చాయి. శృంగారంలో పాల్గొనే వారు వయసు మీదపడినా యవ్వనంగా కనిపిస్తారని వైద్యులు చెప్తున్నారు. 
 
శృంగారం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా రోగనిరోధకశక్తి వృద్ధి చెందుతుందని.. మైగ్రేయిన్, కీళ్లనొప్పులు బాధలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

తర్వాతి కథనం
Show comments