Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో జలుబు చేస్తే.. నెయ్యిని గుండెలపై రాసుకుంటే?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (17:48 IST)
నెయ్యిని వాడితే బరువు పెరిగిపోతారని.. అందులో కొలెస్ట్రాల్ వుందని అందరూ అంటుంటారు. కానీ నెయ్యిని ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఆవుపాలతో తయారయ్యే నెయ్యి.. జలుబు, దగ్గు, రక్తహీనత, మొటిమలు, బలంలేకుండా కనిపించడం వంటి రుగ్మతలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో నేతిని వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
జలుబుతో బాధపడే చిన్నారులకు వేడి చేసిన నేతిని గుండెలపై మర్దన చేసేవారికి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేగాకుండా.. నేతిలో దోరగా వేపిన ఉల్లిపాయల్ని తీసుకోవడం ద్వారా గొంతు నొప్పులను దూరం చేసుకోవచ్చు. రోజుకో స్పూన్ నేతిని తీసుకోవడం ద్వారా కంటి దృష్టి మెరుగుపడుతుంది. ఐ ప్రెషర్‌ను నియంత్రించుకోవచ్చు. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తిని నెయ్యి పెంచుతుంది. 
 
అలాంటి నెయ్యిని చలికాలంలో మితంగా ఉపయోగించాలి. జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. శరీరానికి శక్తి లభించాలంటే.. నెయ్యిని కొద్దిగా ఆహారంలో చేర్చుకోవాలి. శీతాకాలంలో నెయ్యిని తీసుకుంటే శరీరంలో వేడి పుడుతుందట. తద్వారా చలిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. 
 
చలికాలంలో బద్ధంగా, నీరసంగా అనిపిస్తే.. నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటే.. నెయ్యిని కొద్దిగా వేడి చేసి ముక్కులో రెండు చుక్కలు వేస్తే.. జలుబు దానంతట అది తగ్గిపోతుంది. చలికాలంలో చర్మాన్ని కాపాడాలంటే.. నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments