Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఐవీఆర్
మంగళవారం, 27 మే 2025 (16:52 IST)
విక్రమ్ దేశాయ్, 34 ఏళ్ల వయస్సు గల వ్యక్తి, ఒక ప్రముఖ మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ, తన జీవనశైలిలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యతను పాటిస్తాడు. అయితే ఇటీవల జరిగిన ఒక సాధారణ ఆరోగ్య తనిఖీలో, అతని కొలెస్ట్రాల్ స్థాయిలు ఆశించిన స్థాయికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఆయన షాక్‌కు లోనయ్యాడు. "నేను రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తాను, ఆరోగ్యకరంగా తింటాను. కానీ పరీక్షలు చేయించుకున్నప్పుడే నా కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిసింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల, పరీక్ష చేయించుకోకపోతే నాకు అసలు తెలిసేది కాదు. ఆరోగ్యంగా ఉన్నాననే తప్పుడు నమ్మకంలోనే ఉన్నాను," అని విక్రమ్ చెప్పాడు.
 
ఈ సంఘటన విలక్షణమైనదేం కాదు. ఇటీవలి గణాంకాల ప్రకారం, భారతదేశంలో సుమారు 31 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులకు, మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా అధిక కొలెస్ట్రాల్ నిలుస్తోంది. కొలెస్ట్రాల్ అంటే తప్పనిసరిగా చెడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి, విటమిన్ D నిర్మాణం, జీర్ణక్రియలో కీలకమైన పిత్త ఆమ్లాల తయారీలో సహాయపడుతుంది. ఇది జీవనానికి అవసరమైన ఒక ముఖ్యమైన పదార్థం. అయితే సమస్య ఏమిటంటే, చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణించే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ (LDL-C) స్థాయిలు అదుపు తప్పినప్పుడు, రక్తనాళాల్లో పేరుకుపోయి, హృదయ సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.
 
LDL కొలెస్ట్రాల్ అనేది చాలా సందర్భాల్లో 'సైలెంట్ కిల్లర్'గా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ ఇవ్వకుండా నెమ్మదిగా ప్రమాదకరంగా మారుతుంది. ఈ అధిక LDL స్థాయిలు ధమనులలో ఫ్లాక్ పేరుకుపోయేలా చేసి, రక్తప్రవాహానికి అడ్డుగా మారుతుంది. దీనివల్ల గుండెకు తగినంత రక్తం చేరకపోవడం, చివరికి గుండెపోటుకు దారితీయడం జరుగుతుంది. ఇది కేవలం హృదయానికి మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర అవయవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సైల్లెంట్ లక్షణాల కారణంగా, తరచూ చెక్‌అప్, స్క్రీనింగ్‌ చేయించుకోవడం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ తమకు సరిపోయే లక్ష్య LDL-C స్థాయిలను తెలుసుకోవాలి. డాక్టర్లు సూచించిన మేరకు ఆ స్థాయిని నిర్వహించడం ఆరోగ్యంగా ఉండేందుకు కీలకం.
 
డాక్టర్ పిఎల్ఎన్ కపర్ది, కాథ్ ల్యాబ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్, కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్, మాట్లాడుతూ, ధమనులు ఇరుకుగా మారడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, అవయవాలపై ఒత్తిడి పడుతుంది, హార్మోన్లలో సమతుల్యత తప్పుతుంది. ఇవన్నీ చాలాసార్లు సంవత్సరాలుగా ఎలాంటి లక్షణాలు లేకుండా దాగివుంటాయి. ఇప్పటికీ చాలామంది ‘అధిక కొలెస్ట్రాల్ అనేది వయసైన వారికే వస్తుంది’ అనే అపోహలో ఉన్నారు. కానీ ఇది సరికాదు. నేటి జీవనశైలి కారణంగా, 18 ఏళ్ల వయస్సు నుంచే లిపిడ్ ప్రొఫైల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మీరు లక్ష్య స్థాయిలను తెలుసుకున్న తర్వాత, నిపుణుల నుండి చికిత్స పొందడం, సూచించిన మందులకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. తీవ్రమైన సందర్భాల్లో, సాధారణ మందులతో కంట్రోల్ కాకపోతే ఇన్క్లిసిరాన్ వంటి ఆధునిక చికిత్సా పద్ధతులను వైద్యులు సూచించవచ్చు,” అని ఆయన తెలిపారు.
 
చాలామంది కొలెస్ట్రాల్ సమస్యను గుండె ఆరోగ్యంతో మాత్రమే అనుసంధానం చేస్తారు. అయితే నిజానికి, అధిక ఎల్డిఎల్(LDL) కొలెస్ట్రాల్ మెదడుకు చేరే రక్తప్రవాహాన్ని బాగా తగ్గిస్తుంది. దీనివల్ల మెదడు తగినంత ఆక్సిజన్ అందుకోలేకపోతుంది. సంవత్సరాలుగా ఇలా కొనసాగితే, ఇది వాస్కులర్ డిమెన్షియా, జ్ఞాపకశక్తి లోపాలు, కొన్ని సందర్భాల్లో స్ట్రోక్2 వంటి ప్రమాదకరమైన నరాల సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
 
హార్మోన్ల ఉత్పత్తికి కొలెస్ట్రాల్ ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్. అయితే, కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతుల్యతలు LDL-C స్థాయిలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకి, రుతువిరతి తర్వాత ఈస్ట్రోజన్ స్థాయిలు గణనీయంగా తగ్గిన సమయంలో మహిళల్లో LDL-C స్థాయిలు పెరుగుతాయి. అలాగే, థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసే హైపోథైరాయిడిజం వంటి పరిస్థితుల్లో కూడా LDL-C స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
 
అధిక LDL-C స్థాయిలు ధమని వ్యాధి (PAD) అనే సమస్యకు దారితీస్తాయి. ఇది కాళ్ళు, చేతుల్లోని ధమనులు ఇరుకుగా మారిపోవడానికి లేదా పూర్తిగా అడ్డుగా మారడానికి కారణమవుతుంది. ధమనులు గట్టిపడినప్పుడు, గుండె ఎక్కువగా శ్రమించి పని చేయాల్సి వస్తుంది, ఇది రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది. దీంతో శరీరం తీవ్రమైన హైపర్‌టెన్షన్ పరిస్థితికి చేరవచ్చు. అలాగే, LDL-C స్థాయిలు పెరగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఉదాహరణకు, పిత్తంలోని అధిక కొలెస్ట్రాల్ నెమ్మదిగా స్ఫటికాలుగా మారి, పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్టోన్లు ఏర్పడే అవకాశముంటుంది.
 
శరీరంలో కొలెస్ట్రాల్ మెటబాలిజం కేవలం మనం తినే ఆహారం లేదా మనం ఎంత కదులుతున్నామో దాని ద్వారా మాత్రమే కాకుండా, ఒత్తిడి, నిద్ర నాణ్యత మరియు మొత్తం జీవక్రియ ఆరోగ్యం వంటి అంశాల ద్వారా కూడా ప్రభావితమవుతుంది. సాధారణ శారీరక కార్యకలాపాలు HDL లేదా "మంచి కొలెస్ట్రాల్" స్థాయిలను మెరుగుపరచడంలో తోడ్పడతాయి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. కానీ ఇవి మొత్తం చిత్రంలో ఒక భాగం మాత్రమే.
 
ఒత్తిడిని తగ్గించే మైండ్‌ఫుల్‌నెస్, యోగా వంటి విధానాలు, సరైన నిద్ర షెడ్యూల్‌ పాటించడం వంటి సమగ్ర జీవనశైలి కూడా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ మార్పులు శక్తివంతమైనవే అయినా, అవి మందులకు ప్రత్యామ్నాయాలు కావు. స్థిరంగా అధికంగా ఉండే LDL స్థాయిలు లేదా గుండె సంబంధిత వ్యాధులకు ఎక్కువ రిస్క్ ఉన్నవారికి, ఔషధాలు సమర్థవంతమైన చికిత్సలో కీలకంగా కొనసాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆమె తల వేరు చేసి పెద్దమ్మ గుడి ముందు పెట్టివచ్చా, పోలీసుల ముందు కత్తితో నిందితుడు (video)

రూ.3 వేలు చెల్లిస్తే చాలు.. యేడాదంతా ఫ్రీగా టోల్ పాస్

కనీసం కాపీ కొట్టడం కూడా దద్దమ్మలు... తెలివి తక్కువ జోకర్స్ - పాక్‌ పరువుతీసిన అసదుద్దీన్

వల్లభనేని వంశీ ఆరోగ్యం వరెస్ట్‌గా మారిపోతోందా? దగ్గుతూ, రొప్పుతూ....

ఒక సబ్జెక్టులో ఫెయిల్- ఫోన్‌లో గేమ్‌లు.. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వానికి వారధి ఫిలింఛాంబర్ మాత్రమే - త్వరలో కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ : పవన్ కళ్యాణ్

అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్

హింసకన్నా విలువలతో కూడిన షష్టిపూర్తి నచ్చి హేమాహేమీలు పనిచేశారు: హీరో, నిర్మాత రూపేశ్

జూన్ 6వ తేదీన అఖిల్ అక్కినేని వివాహం!!

హార్డ్ డిస్క్ మాయం వెనుక ఎవరు ఉన్నారు?

తర్వాతి కథనం
Show comments