ప్రతి రోజూ గుడ్డు ఎందుకు తినాలంటే...

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (12:16 IST)
పోషకాల నిలయం గుడ్డు. ప్రతి పేదోడుకి కూడా పుష్కలంగా పోషకాలు అందించేది గుడ్డు. అలాంటి గుడ్డులో మాంసకృత్తులు (ప్రోటీన్‌), అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, డి విటమిన్‌, ఖనిజాలు దండిగా ఉంటాయి. 
 
కానీ, ప్రతి రోజూ ఒక గుడ్డును తినడం వల్ల బరువు పెరుగుతుందని చాలా మందిలో ఓ అపోహ ఉంది. దీనికి కారణం పచ్చసొనలోని కొలెస్ట్రాలే. 
 
అయితే గుడ్డులో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు అంత ఎక్కువగా ఏమీ పెరగటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. 
 
ఇందులో కేలరీలు తక్కువ. పైగా చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. ఇలా ఇది పరోక్షంగా బరువు తగ్గటానికీ తోడ్పడుతుందన్నమాట. 
 
* కణాల పనితీరు, వాటి ఎదుగుదల, శక్తిని అందించటంతో పాటు శరీరంలో జరిగే పలు జీవక్రియలకు అవసరమైన పోషకాలు గుడ్డుతో లభిస్తాయి. 
* రోజుకు ఒక గుడ్డు తినేవారిలో పక్షవాతం ముప్పు 12 శాతం వరకు తగ్గుతున్నట్టు ఒక పరిశోధనలో వెల్లడైంది.
* ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలోని ఐరన్‌ మన శరీరం తేలికగా గ్రహించటానికి అనువుగానూ ఉంటుంది. 
* గుడ్డులోని ల్యూటీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి జబ్బుల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. 
* వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ ఇది దోహదం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

తర్వాతి కథనం
Show comments