Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఫాస్ట్' ఫుడ్స్ తెచ్చే తిప్పలు.... సంప్రదాయ చిరుతిండ్లే మేలు...

'ఫాస్ట్' ఫుడ్స్ తెచ్చే తిప్పలు.... సంప్రదాయ చిరుతిండ్లే మేలు...
, బుధవారం, 7 నవంబరు 2018 (11:39 IST)
ఆధునికత పేరుతో జీవనశైలి శరవగంగా మారిపోతోంది. వేగంగా చకచకా వండుకునే పదార్థాల(ఫాస్ట్ ఫుడ్స్)కు ఆదరణ పెరుగుతోంది. ఇలా ఫాస్ట్‌గా వండే వాటిల్లో చాలావరకు పిండి పదార్థాలూ, అదీ తేలికగా జీర్ణమైపోయే రకమే ఎక్కువగా ఉంటాయి. 
 
వీటిలో మాంసకృత్తులు చాలా తక్కువ. కాబట్టి అల్పాహారంగా కూడా ఫాస్ట్‌ ఫుడ్స్‌, బిస్కట్లు, చిప్స్‌, నూడిల్స్‌ వంటి వాటిని ఆశ్రయించే బదులు - వేయించిన శెనగలు, పల్లీల చిక్కీ వంటివి తినటం వల్ల మాంసకృత్తులు లభిస్తాయి. 
 
50 గ్రాముల వేయించిన శెనగల నుంచి దాదాపు 11 గ్రాముల వరకూ మాంసకృత్తులు లభిస్తాయి. ఎక్కడకన్నా వెళ్లేటప్పడు కూడా మాంసకృత్తులు కాస్త ఎక్కువగా ఉండే ఉడికించిన మొలకలు, ఉడికించిన పప్పులు, వేయించిన శెనగలు, ఉడికించిన గుడ్లు, మజ్జిగ వంటివి తేలికగా తీసుకువెళ్లొచ్చు. 
 
* మాంసకృత్తులు దండిగా ఉన్న ఆహారం తీసుకుంటే... చాలాసేపు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది, వెంటవెంటనే ఆకలి వెయ్యదు. దీనివల్ల అనవసరంగా, అధికంగా క్యాలరీలు తీసుకోవటమన్నది ఉండదు. దీనికితోడు మాంసకృత్తులు దండిగా ఉండే ఆహారం తీసుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటివీ కూడా అదుపులో ఉంటుంది.
 
* సంప్రదాయంగా మనం తినే పప్పు - అన్నం, ఇడ్లి - సాంబార్‌, పూరీ - శెనగల కూర వంటి వాటిలో పప్పులు, తృణ ధాన్యాలు కలగలిసి ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా మాంసకృత్తులు అందుతాయి, అవి చక్కగా ఒంటబడతాయి కూడా. కాబట్టి ఫాస్ట్‌ఫుడ్స్‌ కంటే కూడా వివిధ రకాల పప్పులు - ధాన్యాలను కలిపి వండే సంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వటం అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంటల తరబడి కంప్యూటర్లతో కుస్తీ... శృంగారానికి నై అంటున్న స్త్రీలు...