Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వయసులో స్త్రీ గర్భం ధరిస్తే చాలా మంచిది...

గర్భధారణకు అవకాశమైన, సంతోషపూరిత సమయం ఏదీ అనుకుంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా భార్యాభర్తలు సిద్ధంగా వుండటమే. శారీరక రీత్యా చూస్తే గర్భదారణకు 20-25 సంవత్సరాల మధ్య వయస్సు అనువైనది. ఈ వయస్సులో ఫెర్టిలిటీ ఉత్తమంగా ఉంటుంది. మహిళలు సాధారణంగా ఈ వయస్సుల

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (14:20 IST)
గర్భధారణకు అవకాశమైన, సంతోషపూరిత సమయం ఏదీ అనుకుంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా భార్యాభర్తలు సిద్ధంగా వుండటమే. శారీరక రీత్యా చూస్తే గర్భదారణకు 20-25 సంవత్సరాల మధ్య వయస్సు అనువైనది.
 
ఈ వయస్సులో ఫెర్టిలిటీ ఉత్తమంగా ఉంటుంది. మహిళలు సాధారణంగా ఈ వయస్సులో ఆరోగ్యంగా వుంటారు. గర్భ సంబంధింత సమస్యలు ఈ వయస్సులో సాధారణంగా తలెత్తవు. బిడ్డ టీనేజ్‌కు వచ్చేసరికి వయస్సు ఎక్కువ గల తల్లిదండ్రులు కంటే ఈ వయస్సులో వారు అధిక శక్తితో ఉంటారు.
 
ముప్పైలలోకి అడుగు పెట్టేకొద్దీ వారి ఫెర్టిలిటీ శాతం తగ్గడం ఆరంభిస్తుంది. ముప్పై నలభైల మధ్యకు వచ్చే సరికి గర్భం దాల్చడం క్లిష్టంమవుతుంది. 35 సంవత్సరాలు దాటిన వారికి గర్భస్రావాలు, బిడ్డ పుట్టుక లోపాలు ఎక్కువవుతాయి. డయాబెటిస్(గర్భధారణలో వచ్చేది) హైపర్ టెన్షన్, సమయం కంటే ముందే ప్రసవాలు వంటి సమస్యల శాతం కూడా పెరుగుతుంది.
 
అయితే, వైద్యశాస్త్ర పురోగతి దృష్ట్యా సరైన చికిత్సలు... జాగ్రత్తల వల్ల ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. వయస్సు సంగతిని పక్కన వుంచితే, గర్భధారణకి ఆరోగ్యంగా వుండటమన్నది ప్రధానం. సంపూర్ణ ఆరోగ్యంతో వుంటే ఏ వయస్సులోనైనా గర్భం దాల్చవచ్చు. ఎవరికివారు తమ అవకాశాలు, అవసరాల్ని దృష్టిలో వుంచుకుని ప్లాన్ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments