Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయలో ఏముంది?

మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలు తింటూ ఉంటాం. ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. వీటన్నింటిలో రారాజు అయినటువంటి వంకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంకాయ వంటి కూర, శంకరుని వంటి దైవం లేదని

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (21:46 IST)
మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలు తింటూ ఉంటాం. ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. వీటన్నింటిలో రారాజు అయినటువంటి వంకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంకాయ వంటి కూర, శంకరుని వంటి దైవం లేదని అంటారు. నోరూరించే రుచితో పాటు వంకాయ వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
 
ఇందులో విటమిన్స్, మినరల్స్‌తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వంకాయ తొక్కులో ఉండే యాంధోసియానిన్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కారకాలతో పోరాడతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి వంకాయ ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. వంకాయ శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్సడకుండా నిరోధిస్తుంది.
 
2. వంకాయలో క్యాలరీస్ అస్సలు ఉండవు. కనుక బరువు తగ్గాలి అనుకుంటే మనం తరచూ వంకాయ తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలు బాగా జరిగేలా చేస్తుంది.
 
3. వంకాయ రక్తంలోని చక్కెర స్ధాయిలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్తప్రసరణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.
 
4. వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటి, కఫము తగ్గుతాయి. 
 
5. వంకాయలు ఆకలిని పుట్టిస్తాయి. వాతాన్ని తగ్గిస్తాయి. శుక్రాన్ని వృద్ధిచేస్తాయి. శరీరంలో వాపు, నరాల బలహీనతను తగ్గించే శక్తి వంకాయకు ఉంది. అంతేకాకుండా ఇది వృద్ధాప్య చాయలు దరిచేరనీయదు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments