Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. ఇవి తినాల్సిందే..

Webdunia
శనివారం, 18 జులై 2020 (15:02 IST)
కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే.. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం అంటున్నారు.. వైద్యులు. తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. ధాన్యాలలో మినరల్స్‌, ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్‌బ్లడ్‌ సెల్స్‌కు బాగా సహాయ పడుతుంది. 
 
ఈ రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌ గుండెకు, కండరాలకు ఆక్సిజన్‌ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమద్ధిగా ఉన్నాయి.
 
అలాగే ఓట్‌ మీల్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉండటం వలన ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా సహాయ పడుతుంది. శరీరం, జీవనచర్యకు ఉపయోగపడే శక్తిని ఇస్తుంది. ఇక రోజుకు ఓ కోడిగుడ్డు తీసుకోవాలి. సాల్మన్ ఫిష్‌‌ను తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. కరోనా వేళ వారంలో నాలుగు సార్లు సాల్మన్‌ ఫిష్‌ను తీసుకోవాలి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్‌ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది. 
 
అలాగే డార్క్‌ చాక్లెట్‌ శరీరంలో ఇన్ఫమేషన్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫ్లేవనాయిడ్‌ కంటెంట్స్‌ బ్లడ్‌ సర్కులేషన్‌కు బాగా సహాయపడుతాయి. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. పెరుగును తీసుకోవడం ద్వారా మాంసకృత్తులు లభిస్తాయి. క్యాల్షియం లభిస్తుంది. వీటితో పాటు అరటిపండు, స్వీట్ పొటాటో, పుట్టగొడుగులు, అనాస పండు ముక్కలను రోజూ వారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments