Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న ఉసిరి కాయలను మధుమేహం వున్నవారు తింటే..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (21:53 IST)
ఉసిరిలో రెండు రకాలున్నాయి. పెద్ద ఉసిరి కాయలు, చిన్న ఉసిరి కాయలు. పెద్ద ఉసిరి కాయలను సహజంగా పచ్చడి పడుతుంటారు. చిన్న ఉసిరికాయలు మార్చి, ఏప్రిల్ నెలల్లో వస్తాయి. ఈ చిన్న ఉసిరిని రక్తస్రావం లోపాలు వున్నవారు తినడం మంచిది కాదని నిపుణులు చెపుతున్నారు.
 
ఇవి కొంతమందిలో రక్తస్రావం లేదా గాయాల ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తస్రావం లోపం ఉంటే వీటిని వాడటంలో జాగ్రత్త అవసరం. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల విషయంలో ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. డయాబెటిస్ మందులను వాటిని బట్టి ఆరోగ్య సంరక్షకులు సర్దుబాటు చేయాల్సి వుంటుంది.
 
ఇక పెద్ద ఉసిరి విషయానికి వస్తే... ఇందులో ఎన్నో ఆరోగ్య విలువలు, ఔషధ లక్షణాలు ఉన్నాయన్న విషయం మన అందరికి తెలిసిందే. ముఖ్యంగా శృంగార సమస్యలతో బాధపడేవారు ఉసిరికాయను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉసిరికాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. పుల్లపుల్లగా వగరుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయి. యాపిల్‌తో పోలిస్తే ఇందులో మూడు రెట్లు ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
 
2. దానిమ్మ పండుతో పోలిస్తే దాదాపు 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
 
3. ఉసిరిలో యాంటీవైరల్, యాంటీమాక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాయ రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
 
4. శృంగార సామర్ధ్యం పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్రను పోషిస్తుంది. ఆ సమయంలో వచ్చే అలసటను దూరం చేస్తుంది.
 
5. ఉసిరికాయ హృద్రోగం, మధుమేహం రాకుండా కాపాడుతుంది. మెదడు పనితీరు మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి శరీరాన్ని ఎండ వేడి నుంచి కాపాడుతుంది.
 
6. జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది. చుండ్రు కేశ సంబంధిత అనేక సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
7. ఉసిరిని తీసుకోవడం వల్ల చర్మంపై మచ్చలను, వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలను నివారించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments