Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహార పదార్థాలు.. బట్టతల, ఒబిసిటీ తప్పదా?

పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నా.. పెద్దలు కార్యాలయాలు వెళ్తున్నా, అల్పాహారం, భోజనం ప్లాస్టిక్ బాక్సుల్లో నింపేస్తున్నారా.. అయితే ఇక ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహార పదార్థాలను నింపడం మానేయండి. ఎందుకంటే.. ప్లాస

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (11:26 IST)
పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నా.. పెద్దలు కార్యాలయాలు వెళ్తున్నా, అల్పాహారం, భోజనం ప్లాస్టిక్ బాక్సుల్లో నింపేస్తున్నారా.. అయితే ఇక ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహార పదార్థాలను నింపడం మానేయండి. ఎందుకంటే.. ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని నింపడం ద్వారా ప్లాస్టిక్‌లోని హానికరమైన రసాయనాలు ఆహారంలో కలిసిపోతాయి. ఒకప్పుడు స్టీలుతో చేసిన లంచ్‌ బాక్సులను ఉపయోగించేవారు. 
 
ఇప్పుడు ప్లాస్టిక్‌తో చేసిన రంగురంగుల లంచ్‌ బాక్సులను వినియోగిస్తున్నారు. ఇళ్లలో రుచికరమైన, షోషక విలువలతో కూడిన వంట తయారు చేసి వాటిని ప్లాస్టిక్ బాక్సుల్లో నింపి పంపడం ద్వారా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్లాస్టిక్‌ కవర్లలో షాపుల్లో అమ్మే సాంబారు, పెరుగు, కూరలు, చట్నీలు కూడా తీసుకోకూడదని.. తద్వారా ఆరోగ్యానికి హానికరమేనని వారు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాక్సుల్లో వేడి ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్లే బాక్సుకు ఉన్న రంగులు, అందులోని రసాయనాలు ఆహారంలో చేరే అవకాశం ఉంది. పిల్లలు హాట్‌బాక్సు, స్టీల్‌ బాక్సుల్లో అల్పాహారాన్ని, భోజనాన్ని తీసుకెళ్లడం ఉత్తమం. 
 
వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వేడిగా ఉన్న పదార్థాలు చల్లార్చి బాక్సుల్లో నిల్వ ఉంచి పిల్లలకు అందించాలి. తాగునీటి కోసం వాడే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్ల వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది. ప్లాస్టిక్‌తో చేసిన లంచ్‌ బాక్సులు, వాటర్‌ బాటిళ్లు కొనేముందు నాణ్యతను పరిశీలించాలి. 
 
నాణ్యమైన ప్లాస్టిక్‌ వస్తువులు వల్ల అంతగా హాని ఉండదు. కారుచౌకగా ఉండే వాటిని వాడడం వల్ల అనేక అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. లంచ్‌ బాక్సులను సరిగ్గా శుభ్రం చేయకుండా ఆహార పదార్థాలు ఉంచితే ఆహారం విషతుల్యమై డయేరియా, వాంతులకు దారితీసే ప్రమాదం ఉంది.
 
ఇంకా ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్ వాడటం ద్వారా ఒబిసిటీ ఆవహిస్తుంది. ప్లాస్టిక్ వస్తువుల్లోని హానికరమైన ప్లాస్టిక్ రేణువులు, రసాయనాలు మానవ శరీరంలోని వెళ్తే.. ఇక అనారోగ్యాలు తప్పవు. తద్వారా 92 శాతం మంది ప్రజలు హెయిర్ ఫాల్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. కాలక్రమేణా ఇది బట్టతలకు దారితీస్తుందని అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
ప్లాస్టిక్ వస్తువుల్లో నింపబడే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సంతానలేమి ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత ఇకపై ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపడం మంచిదని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments