మహారాష్ట్రలో ప్లాస్టిక్‌పై నిషేధం.. వాటిని కూడా చేర్చారా?: పూనమ్ ప్రశ్న
మహారాష్ట్ర సర్కారు ప్లాస్టిక్ వాడకంపై ఇటీవల విధించిన నిషేధంపై ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధంలో కండోములను కూడా చేర్చారా? అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించింది. అం
మహారాష్ట్ర సర్కారు ప్లాస్టిక్ వాడకంపై ఇటీవల విధించిన నిషేధంపై ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధంలో కండోమ్‌లను కూడా చేర్చారా? అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించింది. అంతేగాకుండా.. మరో ట్వీట్‌లో ప్లాస్టిక్ నిషేధం అమల్లో వుంది కనుక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ల దయచేసి బయటికి రాకండి అంటూ సెటైర్లు విసిరింది.
మహారాష్ట్రలో ప్లాస్టిక్‌ను విక్రయించినా, ఉపయోగించినా భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పూనమ్ చేసిన సెటైరికల్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూనమ్ ట్వీట్లపై నెటిజన్లు కూడా అంతే సెటైరికల్‌గా ట్వీట్ చేస్తూ పూనమ్‌ను ట్రోల్ చేస్తున్నారు.
కండోముల గురించి పూనమ్ అడిగిన ఓ ప్రశ్నకు ఓ నెటిజన్ ఇలా బదులిచ్చాడు. తొలుత ప్లాస్టిక్‌కు, రబ్బరుకు తేడా తెలుసుకుంటే మంచిదని సూచించాడు. నగ్నత్వ ప్రదర్శన కోసమే ఆమె చదువుకున్నట్టు అనిపిస్తోందని చురకలంటించాడు. మరో యూజర్ ఆమె ఫొటోలను పోస్టు చేసి 'నీ దగ్గరే బోలెడు ప్లాస్టిక్ వుంది'' అంటూ హెచ్చరించాడు. పూనమ్ చేసిన ట్వీట్స్‌పై ప్రస్తుతం నెటిజన్స్ విభిన్నాభిప్రాయాలు పోస్టు చేస్తున్నారు.