Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో బెల్లం వేసి పిల్లలకిస్తే ఏం జరుగుతుంది?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (21:15 IST)
చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. కానీ బెల్లం వేసిన పాలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. బెల్లం మన శరీరంలోని రక్తకణాలను శుద్ధి చేస్తుంది. రోజూ ఈ బెల్లం వేసిన పాలను తాగడం వల్ల లివర్, కిడ్నీలను హాని కలిగించే వాటిని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
జీర్ణ సంబంధిత సమస్య వుంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. డిప్రెషన్, టెన్షన్ ఉన్నప్పుడు పాలలో కాస్త బెల్లం వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. ఎవరైతే రాత్రిళ్లు నిద్ర బాగా పట్టదో వారు ఈ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుందన్నారు డాక్టర్లు.

నీరసంగా, అలసిపోయినప్పుడు బెల్లం పాలు తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది. బాగా ఆడుకునే పిల్లలకు బెల్లం పాలు యిస్తే తక్షణ శక్తి వచ్చి యాక్టివ్‌గా ఉంటారు. రోజూ ఈ పాలు తాగడం వల్ల కాలుష్యం తగ్గి ఎముకలు బలంగా కూడా మారుతాయట. అలాగే జాయింట్ పెయిన్స్, మజిల్స్ పెయిన్స్‌ను తగ్గిస్తుంది. 
 
బెల్లం మన శరీరంలోని బ్లడ్‌ను శుద్ధి చేస్తుంది. జుట్టు ఊడిపోకుండా తగ్గిస్తుంది. మహిళల్లో పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి బెల్లం పాలు ఎంతగానో ఉపయోగపడుతుందట. పీరియడ్ అవ్వడానికి నాలుగు రోజుల ముందు నుంచి బెల్లం పాలు తాగితే పొట్టనొప్పి, నడుము నొప్పి సమస్యలను అధిగమించవచ్చు. బెల్లం పాలు తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 
 
జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఈ పాలు తాగితే చాలా రిలాక్స్‌గా ఫీలవుతారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వారు ఈ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరంలోని బ్లడ్ ప్రెషర్, ఆమ్ల స్థాయిని కంట్రోల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

తర్వాతి కథనం
Show comments