Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

ఐవీఆర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (22:40 IST)
ఒక రోజు మేల్కొగానే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నట్లు ఊహించుకోండి. కొంతమందికి, ఈ భావన కేవలం ఒక్క క్షణానికే పరిమితం కాదు. అంత కంటే ఎక్కువగా ఉంటుంది-ఇది వారి రోజువారీ జీవితంలో భాగమైపోతుంది. వెర్టిగో అనేది శరీర సంతులన భావాన్ని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. అది ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు, అయినప్పటికీ ఈ పరిస్థితి గురించి అవగాహన మాత్రం ఇప్పటికీ పరిమితం గానే  ఉంది.
 
ప్రపంచవ్యాప్తంగా, వెర్టిగో వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతీ 10 మందిలో ఒకరిని  ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో దాదాపు 70 మిలియన్ల మంది వ్యక్తులు ఈ పరిస్థితి ద్వారా ప్రభావితమయ్యారు. IQVIA సహకారంతో అబాట్ ఇటీవల నిర్వహించిన సర్వేలో భారతదేశంలో చాలా మంది ఒక సంవత్సర కాలంగా వెర్టిగోతో జీవిస్తున్నారని, నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఎపిసోడ్‌లను అనుభవిస్తున్నారని వెల్లడించింది. ఇవి తరచుగా వస్తున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు వారి లక్షణాలను కొట్టివేస్తారు లేదా వైద్య సహాయం తీసుకోవడం పూర్తిగా అవసరమని భావించే వరకు ఆలస్యం చేస్తారు.
 
అబాట్ ఇండియా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జెజో కరణ్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రజలు సరైన మద్ద తును పొందడానికి అవసరమైన జ్ఞానం, సాధనాలతో సహాయం చేయడంలో వెర్టిగో గురించి అవగాహన పెంపొం దించడం  కీలకం. అబాట్, IQVIA చేసిన సర్వే ప్రకారం, స్పిన్నింగ్ సెన్సేషన్‌తో పాటు వెర్టిగో రోగులు అనుభ వించే సాధారణ లక్షణాలు, తలనొప్పి (54%), తల భారం (41%) మరియు మెడ నొప్పి (28%) ఉన్నాయి. ఇది వారి వ్యక్తిగత జీవితాలకు సవాళ్లను సృష్టిస్తుంది, ముఖ్యమైన ఈవెంట్‌లకు హాజరు కాకుండా చేస్తుంది. వారు తమ కుటుంబాలతో గడిపే సమయాన్ని తగ్గిస్తుంది. ప్రారంభ రోగ నిర్ధారణ, సరైన చికిత్స మద్దతును ప్రోత్సహిం చడం వెర్టిగో ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోగులు సమతుల్య, ఆరోగ్యకర మైన జీవితాలను గడపడానికి వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు.
 
వెర్టిగో మైకాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడం
మైకం అనేది శరీరం పడిపోతున్నట్లు, నిలబడలేకపోతున్నట్లు, బ్యాలెన్స్ తప్పుతున్నట్లు, బలహీనంగా ఉన్న ట్లు అనిపించే లేదా వణుకు వంటి అనుభూతి. దీనితో పాటు, వెర్టిగోను అనుభవిస్తున్నప్పుడు, మీ పరిసరాలు మీ చుట్టూ తిరుగుతున్న అనుభూతిని పొందుతారు. బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు భావిస్తారు. చాలా మంది వెర్టిగో ను నిర్లక్ష్యం చేస్తారు. లో బ్లడ్ షుగర్, లో బీపీ,  డీహైడ్రేషన్ లేదా ఒత్తిడి లక్షణాలు అని ఊహిస్తారు. అబాట్, IQVIA చేసిన సర్వే  వెర్టిగో ఉన్నవారిలో 44% మంది కనీసం వారానికి ఒకసారి స్పిన్నింగ్ (పరిసరాలన్నీ మీ చుట్టూరా తిరుగుతున్న అనుభూతి) అనుభవిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించింది. ‘చక్కర్’  తీవ్రత లేదా వె ర్టిగోలో స్పిన్నింగ్ మారవచ్చు, కానీ మనం దానిని తోసిపుచ్చకుండా ఉండటం ముఖ్యం. ముందుగానే దీనిపై దృష్టి పెట్టడం అనేది సకాలంలో రోగనిర్ధారణ, చికిత్సలకు, భవిష్యత్తులో సమస్యలను నివారించడంలో సహాయ పడుతుంది.
 
హైదరాబాద్‌లోని యూపీ శర్మ న్యూరో క్లినిక్‌లో  కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ యూపీ శర్మ ప్రకారం, “భారతదేశంలో వెర్టిగో చాలా సాధారణం, కానీ చాలా మంది వ్యక్తులు లక్షణాలను గుర్తించరు. ఇది రోగ నిర్ధారణ,  చికిత్సను ఆలస్యం చేస్తుంది. నిలకడగా లేకపోవడం మరియు వికారం వంటి వెర్టిగో, తల తిరుగుడు (స్పిన్నింగ్ సెన్సేషన్)  సంబంధిత లక్షణాలను ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియదు. కళ్లు తిరగడం వల్ల చక్కర్ మరియు వెర్టిగో కారణంగా చక్కర్ మధ్య తేడాను గుర్తించడంపై అవగాహన సరైన రోగ నిర్ధారణ, చికిత్స మద్దతు ను పొందడంలో సహాయపడుతుంది’’.
 
వెర్టిగోను సమర్థవంతంగా నిర్వహించడం
 వెర్టిగోను సమర్థవంతంగా నిర్వహించడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సాధారణ చర్యలు.
సత్వర రోగ నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించడం: మీరు వెర్టిగో, సంబంధిత లక్షణాలను అనుభవిస్తే, వైద్యుడిని సంప్రదించి, సూచించిన చికిత్సలు తీసుకోవడం, మందులను వాడడం చాలా ముఖ్యం. భవి ష్యత్ సమస్యలను పరిష్కరించడానికి సత్వర రోగ నిర్ధారణ కీలకం. రెగ్యులర్ చెకప్‌ లకు అనుగుణంగా ఉండటం అనేది లక్షణాలను పర్యవేక్షించడంలో, అవసరమైన విధంగా చికిత్స ప్రణాళికలను సర్దుబాటు చేయడంలో సహాయపడుతుంది.
 
సరైన చికిత్సతో వెర్టిగోను నిర్వహించండి: వెస్టిబ్యులర్ రిహాబిలిటేషన్ థెరపీ, మందులు, కొన్ని సంద ర్భాల్లో శస్త్రచికిత్స ద్వారా వెర్టిగోను నిర్వహించవచ్చు. వైద్యుడిని సంప్రదించడం మీ పరిస్థితికి తగిన చి కిత్స ప్రణాళికను నిర్ణయించడంలో సహాయపడుతుంది. వెర్టిగో కోచ్ యాప్ వంటివి వెర్టిగో మేనేజ్‌ మెంట్‌పై సమగ్ర సమాచారాన్ని అందజేస్తాయి.  వ్యక్తులు తమ వెస్టిబ్యులర్ సిస్టమ్‌కు (సమతుల్య భావ నను, తల కదలికలను సృష్టించే సెన్సరీ వ్యవస్థ) శిక్షణ ఇవ్వడంలో సహాయపడే మాత్రల రిమైండర్‌లు, లైఫ్‌స్టైల్ చిట్కాలు, ప్రత్యేకంగా రూపొందించిన వ్యాయామాల వీడియోలు వంటి సహాయక సేవలతో పరిస్థితిని నిర్వహించడంలో ఇలాంటి యాప్స్ సహాయపడతాయి.  
 
స్లీపింగ్ పొజిషన్‌ను ఆప్టిమైజ్ చేయడం: మీ తల కాస్తంత ఎత్తులో ఉండేలా చూసుకోవడం, మీ వెనుక భాగంపై పడుకోవడం వెర్టిగో లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెర్టిగో ఎపిసోడ్‌లను ప్రేరేపి స్తుంది కాబట్టి పక్కగా పడుకోవడం మానుకోండి.
 
చురుకుగా ఉండటం: యోగా, నడక వంటి సున్నిత వ్యాయామాలు సమతుల్యతను పెంచుతాయి,   వెర్టిగో లక్షణాలను తగ్గిస్తాయి.
 
బ్యాలెన్స్ అనేది మన దైనందిన జీవితంలో ఒక ప్రాథమిక అంశం.  వెర్టిగో బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్ (సెప్టెంబర్ 15  - 21) ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి సమయానుకూలమైన రిమైండర్‌గా పనిచేస్తుంది. అవగాహనను పెంచడం, సత్వర రోగనిర్ధారణను ప్రోత్సహించడం, వెర్టిగోతో బాధపడుతున్న వారికి మద్దతు ఇవ్వడం ద్వారా, మనం సమతుల్యతను కాపాడుకోవడానికి, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి వ్యక్తులను శక్తివంతం చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments