Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్సర్ వున్న వాళ్లు అల్లం జోలికి మాత్రం వెళ్లకూడదు.. తెలుసా?

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (12:30 IST)
అల్లం చాలా వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుందని మనకు తెలుసు. కానీ అల్సర్ ఉన్నవారు మాత్రం అల్లం జోలికి వెళ్లకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అల్లం కొద్దిగా కారంతో కూడిన ఆహారం. వాటితో చేసే పదార్థాలు కూడా కారంగానే ఉంటాయి. కాబట్టి శొంఠి, అల్లం జోలికి అల్సర్ వ్యాధిగ్రస్తులు వెళ్లకూడదు. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దానిని తీసుకోవాలి. 
 
అల్సర్ ఉన్న వారు పరగడుపున అల్లంతో చేసిన వంటకాలను, అల్లంతో చేసిన మందులను తీసుకోకూడదు. అలా చేస్తే ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఆహారం తీసుకున్నాకే అల్లంతో చేసిన వంటకాలను, మందులను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇక అల్లం నయం చేసే వ్యాధుల విషయానికి వస్తే, అల్లం పిత్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 
 
ఆకలి లేమిని నయం చేస్తుంది. వేవిళ్లు, కడుపు ఉబ్బరం, శ్వాసకోశ సమస్యలను అల్లం నయం చేస్తుంది. వికారం, వాంతులు తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళల్లో వేవిళ్లు తగ్గాలంటే అల్లాన్ని రెగ్యులర్‌గా తినిపించాలి. 
 
ఇంకా గొంతు నొప్పికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతుంటే, నీటిలో అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. తర్వాత అందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments