Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె పదిలంగా ఉండాలంటే వీటిని తీసుకోండి..

Webdunia
శనివారం, 6 జులై 2019 (12:33 IST)
మన శరీరంలోని అవయవాల్లో గుండె చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అందువల్ల అవయవాలు సరిగ్గా పని చేస్తాయి.


ప్రస్తుతం జీవనశైలిలో అనేక మార్పులు సంభవించడంతో పాటు ఇతర కారణాల వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె సంబంధింత వ్యాధులతో అనేక మంది హాస్పిటల్‌ల చుట్టూ తిరుగుతున్నారు. 
 
అయితే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే, మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి.

గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం మనం నిత్యం తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు ఏమిటో ఓసారి చూడండి..
 
* ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంలో ఓట్ మీల్ తినాలి. ఓట్స్‌లోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
 
* చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వారంలో కనీసం 2 లేదా 3 సార్లు చేపలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
 
* డార్క్ చాకొలెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
 
* వాల్‌నట్స్‌లో ఉండే మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. అందుకే వీటిని నిత్యం తినాలి. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలిగిపోతాయి. దాని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments