స్త్రీ పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే ములగ పువ్వులు..

శనివారం, 6 జులై 2019 (11:54 IST)
ప్రకృతిలో ఉండే మొక్కలు, చెట్లు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కొన్ని పౌష్టికాహారాన్ని అందిస్తే, మరికొన్ని ఔషధాలుగా పనిచేస్తాయి. మనం వంటకాలలో ఉపయోగించే ములగ కాయల వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడి చేసి ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి టెన్షన్ తగ్గుతుంది. 
 
మొటిమలతో బాధపడేవారు ములగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ములగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్తి సమస్య ఉండదు. ములగాకు పొడిని పరగడుపున రోజూ ఒక చెంచా మజ్జిగలో కలుపుకుని తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్ దరిచేరదు. ములగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాస్తే తగ్గుతాయి. 
 
ములగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ములగాకును నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. 
 
ములగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి ఆ కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని స్తంభన కలుగుతుంది. ములగ పువ్వులు పాలలో వేసుకొని తాగాలి. దీనివలన ఆడవారికి, మగవారికి శృంగార సామర్థ్యం పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే వంకాయ