Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంతాన సాఫల్యతకు ఎండుద్రాక్ష తినాలట..

సంతాన సాఫల్యతకు ఎండుద్రాక్ష తినాలట..
, బుధవారం, 3 జులై 2019 (18:59 IST)
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడతాయి. శరీరానికి బలాన్ని ఇస్తాయి. అనేక పోషకాలను అందిస్తాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సహజంగా తీసుకునే ఆహారం వలన వచ్చే అనారోగ్యాలను ఇవి నివారించగలవు. కిస్‌మిస్ బాగా తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టచ్చని డాక్టర్లు చెబుతారు. పలు రకాల ఆయుర్వేద మందుల్లో కూడా ఎండుద్రాక్షను వినియోగిస్తారు.
 
ఎండుద్రాక్షలో ఐరన్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం పనితీరుకి ఇవి చాలా మంచివి. 
 
ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేని వాళ్లకి ఎండుద్రాక్ష ఎంతో ఉపయోగకరం. ఎండుద్రాక్ష తినడం వల్ల సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి మెదడుకి కూడా మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి. వీటిలో పొటాషియం, కెటెచిన్లు, విటమిన్‌-సి పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇవి ఆర్ధరైటిస్‌తో బాధపడేవాళ్లకి ఎంతో మేలు చేస్తాయి. 
 
అలాగే ఇందులోని ఫినాలిక్‌ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. తరుచూ ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. ఆకలి వేసినప్పుడు స్నాక్స్ కంటే వీటిని తినడం మేలు. ఎండుద్రాక్షలోని పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకం, డయేరియాని నివారిస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీరు తాగితో బోల్డు ప్రయోజనాలు అంటున్న అధ్యయనం... ఎలాగో చూడండి..