Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ్వరంతో భాదపడే వారు అన్నం తినవచ్చా..?

జ్వరంతో భాదపడే వారు అన్నం తినవచ్చా..?
, బుధవారం, 3 జులై 2019 (17:14 IST)
సాధారణంగా సీజన్‌లు మారుతున్నప్పుడు జ్వరాలు రావడం మనం చూస్తూనే ఉంటాం. జ్వరం వచ్చినప్పుడు చాలా మందికి ఏమి తిన్నా నోటికి ఏమీ రుచించదు. బాగా నీరసంగా ఉంటుంది. అన్నం తినడానికి కూడా సుముఖంగా ఉండరు. 
 
అన్నం తింటే సమస్యలు వస్తాయని కొంతమంది చెప్తుంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇదే విషయమై వైద్యులను వివరణ కోరగా వారు అందుకు సంబంధించిన ఒక కారణాన్ని వివరించారు. జ్వరం వచ్చినప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచించారు. 
 
పాలు, బ్రెడ్, కొబ్బరినీరు, ఇడ్లీ మరియు నూనె తక్కువగా వేసి చేసిన పదార్ధాలను తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. అన్నం తినడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి, అన్నం తినకపోవడమే మంచిదని అంటున్నారు. 
 
అంతేకాకుండా జ్వరంగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ మందకొడిగా పనిచేస్తుంది. ఏ ఆహారం అయినా అరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అన్నం తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ 4 కలిపిన చూర్ణం పురుషులు రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే?