Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ 4 కలిపిన చూర్ణం పురుషులు రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే?

Advertiesment
ఆ 4 కలిపిన చూర్ణం పురుషులు రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే?
, బుధవారం, 3 జులై 2019 (16:38 IST)
శృంగారపరమైన సమస్యలతో ఇటీవలి కాలంలో పురుషులు సతమతమవుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఈ సమస్యలకు మందులను వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కానీ పూర్తిగా నయం కావడంలేదు. దీనిని అధిగమించాలంటే మనకు ప్రకృతి ప్రసాదించిన కొన్ని పదార్దాలతో శృంగార సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనివలన సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆరోగ్యానికి కూడా మంచిది. అవేంటో చూద్దాం.
 
1. ఎండు ఖర్జూరపు కాయలను పగులగొట్టి లోపలి గింజలు తీసివేసి నాలుగు ముక్కలుగా కోసి ఒక మట్టి పాత్రలో వేసి, అవి మునిగే వరకు దేశవాళి ఆవునెయ్యి పోయాలి. ఆ పాత్రను 21 రోజుల పాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత పూటకు రెండు ముక్కలు రెండుపూటలా నేతితో పాటు తింటుంటే అమితమైన వీర్య బలం కలుగుతుంది. 
 
2. ఒక స్పూను అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం తరచుగా అప్రయత్నంగా వీర్యంపోవడం తగ్గి శృంగార సామర్ద్యం పెరుగుతుంది.
 
3. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండుద్రాక్షలను సమానంగా తీసుకుని కలిపి చూర్ణంగా చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని చిన్న మాత్రలు మాదిరిగా తయారు చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు పాలలో ఆ మాత్రను కలుపుకుని తాగడం వల్ల క్రమంగా శీఘ్ర సమస్య తగ్గడంతో పాటు స్తంభన సామర్థ్యం పెరుగుతుంది. మంచి సంతృప్తిని చవిచూస్తారు. శృంగారం తర్వాత కొందరు అలసటకు గురువుతుంటారు. అలాంటి వారు ఈ విధంగా చేస్తే అలసట ఉండదు.
 
4. అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చద్దన్నం తింటే.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో?