Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి ఇది కూడా ఓ కారణం...

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (23:28 IST)
నిద్ర వస్తున్నా గట్టిగా అదిమి పట్టేస్తూ నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ వ్యాధి త్వరగా వచ్చే అవకాశముంది. మూడురోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రపోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్ళు ఎక్కువసేపు మెళకువతో వుండేవారు గుర్తించాల్సిన విషయం ఇది. 
 
అయితే వయసులో వుండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చంటున్నారు. కానీ భవిష్యత్ జీవితంలో ఇది సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదముందంటున్నారు. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించిన వారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. 
 
నిద్రలేమి వారి ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకువెళ్ళే ప్రమాదం సైతం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు వహించండం మరవకూడదంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments