Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పదార్థాలు తింటే లివర్ దెబ్బతింటుంది... ఏంటవి?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (19:34 IST)
మద్యం అతిగా సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుందని మనకు తెలిసిందే. అయితే ఇదొక్కటే కాదు. మనం తినే పదార్థాలు, పానీయాలు కూడా కాలేయం దెబ్బతినటానికి కారణమవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
చక్కెరలను మితిమీరి తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది. శరీరం వినియోగించుకోకుండా మిగిలిపోయిన కేలరీలు ఏవైనా కాలేయంలో కొవ్వురూపంలో చేరిపోతాయి. 
 
రుచికరంగా ఉండటానికి చాలా పదార్థాల్లో మోనోసోడియం కలుపుతున్నారు. ఇది కాలేయాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు అంటున్నారు. చిప్స్‌, వేయించి నిల్వ చేసిన పదార్థాల్లో ఉప్పుతో పాటు ట్రాన్స్‌ఫ్యాట్స్‌ కూడా ఉంటాయి. ఇవి కూడా కాలేయం దెబ్బతినటానికి దారితీస్తుంది.
 
కంటి ఆరోగ్యానికి, చూపు బాగుండటానికి విటమిన్‌ ఎ ఎంతగానో తోడ్పడుతుంది. కానీ దీన్ని అవసరమైన దాని కన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయానికి హాని కలిగిస్తుంది. చక్కెర లేని లేదా డైట్‌ కూల్‌డ్రింకుల్లో ఉండే కృత్రిమ తీపి పదార్థాలతో పాటు కార్బన్‌‌డైయాక్సైడ్‌ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల కూల్‌డ్రింకులను అదేపనిగా తాగితే కాలేయ జబ్బుకు దారితీస్తుంది.
 
అధిక రక్తపోటుకు ఉప్పుకి చాలా సంబంధం ఉంది. కానీ ఇది కాలేయ జబ్బునూ తెచ్చిపెడుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో ద్రవాల మోతాదులు పెరుగుతాయి. ఇది కాలేయంలో కొవ్వు పోగుపడటానికి దారి తీస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

తర్వాతి కథనం
Show comments