Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు పెరిగిన ప్రాముఖ్యత

Webdunia
గురువారం, 7 జులై 2022 (22:59 IST)
భారతదేశంలోని  ప్రజలు మొక్కల ఆధారిత డైట్‌ల వైపు మళ్లుతున్నారు. దానితో పాటుగా జంతువుల ఆధారిత ఉత్పత్తుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకుంటున్నారు. మొక్కల ఆధారిత డైట్స్‌కు ఆరోగ్య కారణాల రీత్యా ప్రాచుర్యం కలుగుతుంది. దీనికి తోడు జంతు ఉత్పత్తుల వల్ల పర్యావరణపరంగా కలుగుతున్న ఆందోళనలకు తోడు జంతు సంక్షేమం కూడా మొక్కల ఆధారిత ఆహారం వైపు మళ్లేందుకు తోడ్పడుతుంది. అయితే, ఈ తరహా డైట్‌లను అనుసరించే వారు తమకు తగినంత ప్రోటీన్‌ లభిస్తుందా లేదా అనే ఆందోళనతో బాధపడుతుంటారు. మరీ ముఖ్యంగా  పలు రకాల మాంసం,  పాల ఉత్పత్తలలో అధిక మొత్తంలో ప్రోటీన్‌ లభిస్తున్న వేళ ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

 
మన వంట ఇంటిలో అధికంగా కనిపించే పప్పులు, బాదములు, తృణధాన్యములలో అత్యధిక మొత్తంలో ప్లాంట్‌ ప్రొటీన్‌ ఉంటుంది. వీటిని మన ఆరోగ్య, సంపూర్ణమైన డైట్‌లో భాగంగా తరుచుగా తినవచ్చు. ఉదాహరణకు బాదములు, పౌషకాల గని మాత్రమే కాదు వినియోగపరంగా వైవిధ్యమైనది. విభిన్న రకాల డిష్‌లకు వినూత్నమైన టెక్చర్‌ నూ ఇది జోడిస్తుంది. అది స్వీట్‌ అయినా రుచికరమైన పదార్ధం ఏదైనా సరే సరికొత్త రుచులను ఇది అందిస్తుంది. బాదములలో అత్యద్భుతమైన రీతిలో ప్లాంట్‌ ప్రోటీన్‌ ఉంటుంది. దీనిని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. వాటిలో బాదము పాలు, బాదం పిండి, ముడి బాదములు, వేయించిన బాదములు, కొద్దిగా ఉప్పు జోడించిన బాదములు... అలా ఉంటాయి.

 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘కణజాలం, కండరాలు ఏర్పడటానికి హార్మోన్లు, ఎంజైమ్‌లు సమతుల్యతతో ఉండటానికి ప్రోటీన్‌ అవసరం. శరీరంలో కణాలు, కణజాలం కోలుకునేందుకు సైతం ఇది తోడ్పడుతుంది. మొక్కల ఆధారిత డైట్‌ను అనుసరించాలనుకుంటే మీరు అత్యంత జాగ్రత్తగా మీ డైట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.


ఒక వేళ మీ రోజువారీ కాల్షియం అవసరాలను పాల ఉత్పత్తుల నుంచి పొంది ఉంటే ఇప్పుడు దానిని రాగి, సోయాబీన్‌, ఆకు కూరలు, బాదములు నుంచి పొందవచ్చు. బాదములు లాంటి గింజలు, పప్పులు మరియు కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పులు మీ శరరీ ప్రొటీన్‌ అవసరాలను ఒక వేళ మీరు పూర్తి శాఖాహారులైతే తీరుస్తాయి. బాదములు అత్యుత్తమ స్నాక్‌ అవకాశంగా నిలుస్తాయి. మరీముఖ్యంగా భోజనానికి భోజనానికి మధ్య మీరు ఆకలితో ఉంటే ఇది తోడ్పడుతుంది.  బాదములు లో ప్రోటీన్‌ అధిక మొత్తంలో ఉంటుంది.మజిల్‌మాస్‌ వృద్ధి చేయడంలో అత్యంత కీలకమైన పోషకగా ఈ ప్రోటీన్‌ నిలుస్తుంది’’ అని అన్నారు.

 
మొక్కల ఆధారిత జీవనశైలి మరియు ఆహార పద్ధతులు గురించి ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ మరియు సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ ‘‘ ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా, ఎంతోమంది నున్ను ఒక డైట్‌ ఫాలో కావాలా లేదంటే మరోటి ఫాలో కావాలా అని అడుగుతుంటారు. ఈ ట్రెండ్స్‌ వచ్చి పోతూ ఉంటాయి. అయితే సమతుల ఆహారం తీసుకోవడమనేది అత్యంత కీలకం. రెగ్యులర్‌ వర్కవుట్‌ రొటీన్‌ అనుసరించాలి. ఇంటర్వెన్షనల్‌ ట్రయల్స్‌లో ఫలితాలు వెల్లడించిన దాని ప్రకారం మొక్కల ఆధారిత డైట్స్‌ శరీరంలో కొవ్వు తగ్గించడంతో పాటుగా అధిక బరువు, ఊబకాయులులో అధిక కొవ్వును కరిగిస్తాయని  ఓ అధ్యయనం వెల్లడించింది.

 
ఆ  కోణంలో చూస్తే,  బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు మొక్కల ఆధారిత ఆహారం ఎంతో సహాయపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా క్లయింట్స్‌ నుంచి నేను తరచుగా వినే ఓ ఎక్స్‌క్యూజ్‌ ఏమిటంటే, ఆరోగ్యవంతమైన భోజనం తరుచుగా వండటం చాలా కష్టం. మొక్కల ఆధారిత డైట్స్‌లో  అత్యుత్తమ అంశం ఏమిటంటే, మీరు బాదములు లాంటి గింజలను తినవచ్చు. దీనిలో ప్రోటీన్‌ అధికమొత్తంలో ఉంటుంది. దీనికి ఎలాంటి ప్రిపరేషన్‌ అవసరం లేదు. ఓ గుప్పెడు బాదములు మీ ఆకలి తీర్చడంతో పాటుగా కడుపు నిండిన అనుభూతి సైతం కలిగిస్తుంది.  అదే రీతిలో మీరు ఓ గిన్నెడు క్వినోవాను సైతం కాస్త బాదములు జోడించి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇది తయారుచేయడానికి  5 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది’’ అని అన్నారు.

 
సుప్రసిద్ధ భారతీయ టెలివిజన్‌, సినీ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ, ‘‘నేను ప్రొటీన్‌ అధికంగా ఉండే డైట్‌ అధికంగా తీసుకుంటుంటాను. దీనిలో గుడ్లు, బాదములు, పాలు, పప్పు ఉంటాయి. బాదమలు లాంటి గింజలు సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా ఎక్కడికైనా తీసుకువెళ్ల గలిగే రీతిలో ఉంటాయి.  అంటే ప్రయాణ సమయంలో కూడా  ఆరోగ్యవంతమైన స్నాక్‌ను మీరు తినాలనుకుంటే బాదములు మీ కోరికను తీరుస్తాయి.


ఓ గుప్పెడు బాదములు తినడం వల్ల  భోజనాల నడుమ మీ ఆకలి తీరుతుంది. ప్రతి రోజూ నా డైట్‌లో వాటిని తప్పనిసరిగా భాగంగా చేసుకుంటుంటాను. బాదములలో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది.  దీనితో పాటుగా బాదములలో మెగ్నీషియం, విటమిన్‌ ఈ, జింక్‌, ఇతర కీలకమైన పోషకాలు ఉంటాయి. దీనిని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు, నేను బాదములను విభిన్న మార్గాలలో తింటుంటాను. ఉదాహరణకు, రసం స్పైక్డ్‌ బాదములు తయారుచేయడం లేదంటే డార్క్‌ చాక్లెట్‌తో కలిపి తినడం నేను బాగా ఆస్వాదిస్తుంటాను’’ అని అన్నారు. ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములు తినండి. సహజసిద్ధంగా ప్రోటీన్‌ తీసుకోవడాన్ని పెంచుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తర్వాతి కథనం
Show comments