Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజీ వంటకంగానే కాదు.. సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుద్ది..

క్యాబేజీ వంటకంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన చర్మానికి క్యాబేజీ రసం రాస్తే బాగా పనిచేస్తుంది. అంతేకాదు...కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరో

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (11:06 IST)
క్యాబేజీ వంటకంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన చర్మానికి క్యాబేజీ రసం రాస్తే బాగా పనిచేస్తుంది. అంతేకాదు...కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో బాగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారంటున్నారు. 
 
క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా.. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి.
 
అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందేనని వైద్యుల సూచన.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

తర్వాతి కథనం
Show comments