Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోపం వస్తే.. కాస్త ఎందుకో ఆలోచించండి..

Webdunia
బుధవారం, 22 మే 2019 (17:34 IST)
ప్రతి చిన్న విషయానికి మీకు కొపం వస్తుంటే దానికి కారణం ఏమిటని మీరు ఆలోచించారా? చాలా మంది చేసే పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, చిరాకు పడటం, విసుగు చెందడం జరుగుతుంటుంది. నిద్రలేమితో బాధపడే వారిలో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే దాని ప్రభావం మన ఆరోగ్యంపై బాగా పడుతుంది. 
 
నిద్రలేమితో బాధపడేవారు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా ఒక నిరాశపూరిత వాతావరణంలో వారు ఉంటారట. సాధారణంగా అలసిపోయిన వారిలో చికాకు కనిపిస్తుంది. 
 
అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని, అకారణంగా ఎదుట వారిపై విరుచుకుపడతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మేరకు కొందరిని ఎంపిక చేసి రెండ్రోజులపాటు వారు ఎంతసేపు నిద్రపోవాలో చెప్పి చూశారు.

కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు. అందుకే కంటినిండా నిద్రపోవాలి. దానితోపాటు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments