Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రివేళల్లో పెరుగును తినడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా?

Webdunia
బుధవారం, 22 మే 2019 (15:50 IST)
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగన్నం లేనిదే భోజనం పూర్తయినట్లు కాదు. అలాంటి పెరుగుని రాత్రుల్లో తినవద్దని, ఇలా తింటే శ్వాససంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు చెబుతుంటారు. ఇందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం. 
 
పాలు, పెరుగు పదార్థాల్లో క్యాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. అందుకే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పాల పదార్థాలను తీసుకుంటారు. ముఖ్యంగా శాకాహారులకి మిల్క్ ప్రొడెక్ట్స్ చాలా మంచిది. అయితే రాత్రి పూట పెరుగు తీసుకోవడం వల్ల జలుబు చేస్తుందని, శ్వాససంబంధింత మరియు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతుంటారు. 
 
అందులో ఎంత మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి వారైనా రాత్రి పూట పెరుగు తీసుకోవచ్చని, వీటిని తీసుకోవడం వల్ల అదనపు లాభాలు ఉంటాయని, చక్కగా నిద్రపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గడ్డ పెరుగులా కాకుండా కాస్త పలుచగా మజ్జిగలా చేసుకుని తీసుకుంటే ఇంకా మంచిది. 
 
అయితే ఆ పెరుగు మరీ చల్లగా, ఫ్రిజ్‌లో పెట్టింది కాకుండా సాధారణ టెంపరేచర్‌లో ఉండేలా చూసుకోవాలి అప్పుడే మన శరీరానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఏవేవో కారణాలు చెప్పి ఆరోగ్యాన్నిచ్చే పెరుగును వద్దనకండి, హ్యాపీగా తినేయండి అంటూ నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments