పగటి నిద్ర ఆరోగ్యానికి హానికరమా? కునుకు తీయడానికి ఏ సమయం బెస్ట్!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (08:42 IST)
ప్రతి ఒక్కరూ ఏమాత్రం కాస్తంత వీలు చిక్కినా ఓ చిన్నపాటి కునుకు తీసేందుకు ఇష్టపడుతారు. ముఖ్యంగా.. పగటి పూట ఈ అలవాటు అధికంగా ఉంటుంది. ఓ చిన్నపాటి కునుకుతో పని చేయడం వల్ల ఏర్పడిన అలసట పూర్తిగా మటుమాయమై పోతుంది. అలాగే, మెదకుతో పాటు... ఇతర శరీర అవయవాలకు కూడా కాస్తంత చురుకుదనం తెచ్చిపెడుతుంది. 
 
నిజానికి కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పడుకోవటం ఉత్తమం. సాధారణంగా ఈ సమయంలోనే మన మనసులో నిద్ర వస్తుందన్న భావన కలుగుతుంది. అదేసమయంలో ఓ కునుకు తీయాలనుకునేవారు చిట్టి చిట్కాలు పాటిస్తే ఎంతో శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. 
 
వీలు చిక్కింది కదా అని మధ్యాహ్నం సమయంలో ఎక్కువ సేపు నిద్రపోకూడదు. ఎక్కువ సేపు కునుకు తీయడం వల్ల శరీరం మగతగా అనిపిస్తుంది. పైగా, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. అలాగే, రాత్రిపూట నిద్రను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల వీలైనంత తక్కువ సేపు నిద్రపోవడం అన్ని విధాలా అనుకూలం. 
 
సాయంత్రం వేళల్లో నిద్రకు దూరంగా ఉండటమే మంచిది. నిద్రలేమి, శ్వాససంబంధిత సమస్యలతో బాధపడేవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఇక రాత్రిపూట తగినంత నిద్రపోయేవారికి పగటి నిద్ర అవసరమే రాదు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను మరవకూడదు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఇదే సమయం, వచ్చేయ్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కొండగట్టు అంజన్న వల్లే నాకు భూమి మీద నూకలున్నాయ్ : పవన్ కళ్యాణ్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మావోయిస్టులు హతం

Pithapuram: పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధం అవుతున్న జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments