ఆర్వో నీళ్లు తాగుతున్నారా? కాస్త ఆగండి.. (video)

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (16:18 IST)
ఆర్వో నీళ్లు తాగుతున్నారా? కాస్త జాగ్రత్త పడండి అంటున్నారు వైద్యులు. శుద్ధ జలాలు లభించే గ్రామాల్లోనూ, ప్లాంట్లు నెలకొనడంతో మనం తాగే నీటిలో లవణాలు అంతర్ధానమైపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు.


ఇంకా నీటిని కొనుగోలు చేయడం ద్వారా ప్రజలు డబ్బు ఖర్చు చేయాల్సి వుంది. అయితే ఆర్వో ప్లాంట్లలోని నీటిలో క్యాల్షియం, మెగ్నీషియం స్థాయిలు బాగా పడిపోతున్నట్లు తాజాగా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
ఆర్వో నీటిని తాగేవారికి క్యాల్షియం కొరత ఏర్పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్యూరిఫైయింగ్ ద్వారా మినరల్స్ అన్నీ తొలగిపోతున్నాయి. అందుకే ఆర్వో వాటర్ సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.

ఫ్యూరిఫైయింగ్ ద్వారా నీటిలో పీహెచ్ స్థాయులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. అలాగే మినరల్ వాటర్‌లో కూడా కృత్రిమమైన మినరల్స్ చేర్చడం ద్వారా అనారోగ్య ఇబ్బందులు తప్పవు. 
 
ఇంకా ఆర్వో వాటర్‌లో క్యాల్షియం, మెగ్నీషియం స్థాయులు తగ్గడంతో హృద్రోగ సంబంధిత వ్యాధులు తప్పవు. నరాల ఇబ్బందులు, ప్రెగ్నెన్సీ ఇబ్బందులు, క్యాన్సర్ కారకాలు ఏర్పడే అవకాశం వుందని వైద్యులు చెప్తున్నారు. ఒకవేళ ఆర్వో ఫ్యూరిఫైయర్స్ వాడే పనైతే మినరలైజర్ ఆర్ టీడీఎస్ కంట్రోలర్ / మోడ్యులేటర్ ఫీచర్‌తో వున్నది కొనడం మంచిది.
 
ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్వో నీటిని సేవించాల్సి వస్తే.. మెగ్నీషియం పుష్కలంగా వుండే ఆకుకూరలు, ఆవకోడో, అరటి పండ్లు, రాస్‌బెర్రీ, నట్స్ అండ్ విత్తనాలు, కూరగాయలు (బ్రొకోలీ, క్యాబేజీ, గ్రీన్ బీన్స్), సాల్మన్, తునా చేపలు తీసుకోవాలి. 
 
అలాగే బ్రౌన్ రైస్ ఓట్స్, డార్క్ చాక్లెట్ ఆహారంలో చేర్చుకోవడాన్ని అస్సలు మరిచిపోకూడదు. అలాగే క్యాల్షియంతో కూడిన ఆహారాన్ని కూడా డైట్‌లో భాగం చేసుకోవాలి. పాలు, చీజ్, ఆల్మండ్స్ తీసుకోవాలని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.33కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

నీట్ యూజీ పరీక్ష రద్దు... ఫీజు వాపసు గడువు జూన్ 22కి పెంపు

ఎన్టీఆర్ 103వ జయంతి.. చంద్రబాబు నివాళి.. మహానాడు ఏం టెక్నాలజీ గురూ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments