Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలిని పెంచే ముల్లంగి, ఇది తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (11:50 IST)
ముల్లంగిని చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది సీజనల్ వెజిటబుల్, ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
1. ముల్లంగి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల జలుబు- దగ్గు బారిన పడరు.

 
2. దీన్ని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన రిస్క్ తగ్గుతుంది. ఇందులో ఉండే ఆంత్రాసిన్ గుండె జబ్బుల స్థాయిని తగ్గిస్తుంది.
 
 
3. ముల్లంగిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. జీర్ణక్రియ సులభం అవుతుంది.
 
 
4. మధుమేహ రోగులు కూడా ముల్లంగిని తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని తగ్గిస్తుంది. అయితే, రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నట్లయితే దీనిని తీసుకోకూడదు. లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
 
 
5. శారీరక అలసట ఉన్నప్పుడు ముల్లంగి రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే, ముల్లంగిని తింటే మేలు చేస్తుంది.

 
6. ముల్లంగిని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎందుకంటే ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.

 
7. దంతాలు పసుపు రంగులోకి మారుతున్నట్లయితే, ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిపై నిమ్మరసం వేసి దంతాల మీద రుద్దండి. ఇది పసుపు రంగును తొలగిస్తుంది.

 
8. ముల్లంగిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కిడ్నీ, లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అజీర్తి సమస్య కూడా దూరమవుతుంది.
 
 
9. ఆకలిగా అనిపించకపోతే, ముల్లంగిని తినండి. ఇది ఆకలిని పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments