Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానిమ్మ గింజలను రోజూ అరకప్పు తీసుకుంటే?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (16:53 IST)
దానిమ్మ గింజలను రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియల్‌, వైరల్‌ జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ పండు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువ మొత్తంలో ఉండే ఈ గింజలను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
 
ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ దానిమ్మ గింజలు తినాల్సిందే. వీటిని తినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు విడుదల కాదు. ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు, ఫోలిక్‌ యాసిడ్‌ కాబోయే తల్లికే కాదు, పుట్టబోయే బిడ్డకూ ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణులకు కాళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.
 
రోజూ రెండు కప్పుల దానిమ్మ రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. దాంతో త్వరగా ఆకలి వేయదు. ఈ గింజలు తినడం వల్ల జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. ఇది బరువు తగ్గేందుకూ తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments