ఇంటిపట్టునే ఆక్సిజన్ పల్స్ చెక్ చేసుకోవడం ఎలా?

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:58 IST)
కరోనా వైరస్ సోకిన రోగుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఈ కారణంగానే చాలా మంది మృత్యువాతపడుతున్నారు. అయితే, కరోనా వైరస్ సోకి, ఇంటిపట్టునే చికిత్స తీసుకుంటున్న వారు ఆక్సిజన్ లెవెల్స్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చేసుకోవాలో ఓసారి తెలుసుకుందాం. 
 
కరోనా పాజిటివ్‌ వచ్చినా, లక్షణాలులేకుండా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న వారు పల్స్‌ ఆక్సీమీటర్‌ (ఫింగర్‌ డివైజ్‌)ను కొనుగోలు చేసుకోవాలి. కరోనా సోకని వారూ వీటిని కొనుగోలు చేసుకుని భద్రపరుచుకోవచ్చు. పల్స్‌ ఆక్సీమీటర్‌ను వేలికి పెట్టుకుంటే పల్స్‌తోపాటు రక్తంలో ఆక్సిజన్‌ ఎంతుందో ఇది సూచిస్తుంది. 
 
ప్రతి వ్యక్తికి రక్తంలో ఆక్సిజన్‌ 100 శాతం ఉండాలి. 95 శాతం వరకూ సాధారణంగా, 90-95 శాతం మధ్యలో ఉంటే మోడరేట్‌గా, 90 శాతం కన్నా తక్కువ ఉంటే ప్రమాదకరంగా భావించి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. 97 శాతం ఆక్సిజన్‌ ఉన్నప్పుడు ఆరు నిమిషాలు నడిచిన తర్వాత ఐదు శాతం కంటే ఎక్కువ (92శాతం కంటే) తగ్గితే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. 
 
కరోనా రోగులకు మూడు శాతం తగ్గినా చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పల్స్‌ 70 నుంచి 100 మధ్యలో ఉంటే సాధారణంగా భావిస్తారు. 60 కంటే తక్కువ ఉంటే హార్ట్‌ రేటింగ్‌ తగ్గిందని, 100 కంటే ఎక్కువగా ఉంటే పెరిగినట్లు పరిగణిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

NABARD: ఏపీ రాజధాని అభివృద్ధికి నాబార్డ్ రూ.169 కోట్లు ఆమోదం

అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు : విమానయాన సంస్థకు కేంద్రం హెచ్చరిక

Drone In Tirumala : తిరుమల శిలాతోరణం సమీపంలో డ్రోన్ చక్కర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

తర్వాతి కథనం
Show comments