Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపకింద నీరులా 'నిపా' వైరస్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్.. ఇపుడు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విస్తరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరిలో నిపా వైరస్ లక్షణాలను గుర్తించారు.

Webdunia
గురువారం, 24 మే 2018 (14:43 IST)
కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్.. ఇపుడు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విస్తరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరిలో నిపా వైరస్ లక్షణాలను గుర్తించారు. అలాగే, మహారాష్ట్ర, గోవాలలో ఈ వైరస్ వ్యాపించింది.


కొన్ని జాతుల గబ్బిలాలు, సరిగా ఉడకని పంది మాంసం తినడం ద్వారా ఈ వైరస్‌ సోకుతుందని వైద్యులు వివరించారు. ఈ వైరస్‌కు నిర్ధిష్టమైన చికిత్స లేదన్నారు. వైరస్‌ సోకిన వారిలో మెదడు వాపు లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. వెంటనే చికిత్స చేయకపోతే వారం రోజుల్లో రోగి కోమాలోకి జారుకుంటారని వివరించారు.
 
విస్తరిస్తున్న నిపా... 
ఈ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళ సరిహద్దులను దాటి... కర్ణాటకలో తళుక్కమన్న నిపా వైరస్.. ఇపుడు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు గుర్తించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సర్కారులు అప్రమత్తమయ్యాయి. ఆ వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే వారికి చికిత్స కోసం ప్రధాన ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. 
 
ఐపిఎం ఆధ్వర్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ, నిలోఫర్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో వార్డులను ఏర్పాటు చేసి 5 నుంచి 8 పడకలు నెలకొల్పనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి నియంత్రణకు మూత్ర, రక్త నమునాలు సేకరిస్తామని మంత్రి చెప్పారు. సెలెబ్రో స్పైనల్‌ ఫ్లూయిడ్‌ (సీఎస్‌ఎఫ్‌) నమునాలు సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
 
నిపా వైరస్ లక్షణాలు... 
* నిపా వైరస్‌ ముదరడానికి 7 నుంచి 14 రోజుల సమయం పడుతుంది.
* అప్పటి నుంచి శరీరంలో వేగంగా మార్పులు కనిపిస్తాయి.
* జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, లో బీపీ, కోమాలోకి వెళ్లడం. 
* మెదడువాపు, శ్వాసకోశసం బంధిత సమస్యలు వస్తాయి.
* ప్రత్యేక పరీక్ష ద్వారా నిర్ధారణ. 
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? 
* పందులు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి. 
* పచ్చి పండ్లను తినకూడదు. 
* తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. 
* పూర్తిగా ఉడికిన మాంసమే తినాలి. 
* శుభ్రంగా కడిగిన, వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తినడం మంచిది. 
* బయట వండిన మాంస పదార్థాలను తీసుకోవద్దు. 
* వ్యాధి లక్షణాలు కనిపించినట్లు అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రందించాలి. 

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments